Image result for vote for note scam

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు గతంలో “హైదరాబాద్ బచావ్”  అంటూ ఆందోళన జరిపిన సుంకర వెంకటేశ్వరరావు రాసిన ఈ లేఖ ఆసక్తికరంగా ఉంది. ఈ లేఖలో ఉన్న విషయాలన్నిటితో మనం ఆమోదించవచ్చు లేదా విభేదించవచ్చు మరియు వ్యతిరేకించవచ్చు.  ఆలోచలను లేపే సుంకర గారి ఉత్తరం “ప్రజాబాహుళ్యమానసిక సంఘర్షణ” బహు సున్నితంగా తట్టి లేపింది. విస్తృతంగా చిత్రించింది. నాయకులంత తేలికగా ప్రజలు సంపాదించి ఆస్తులు కూడబెట్ట లేరు.  వారు స్వేదం చిందించి సంవత్సరాల పాటు కష్టపడి బాందవ్యాలు, అనుభందాలు పంచుకొన్న ఆ సంపదలు బంధు త్వాలను రాజకీయ నాయకులంత సునాయాసంగా వదిలిపెట్టలేరు.  లేఖలోని అంశాలు మన హృదయాలను తట్టిలేపుతాయి. హృదయముంటే ముఖ్యమంత్రి సమాదానం ఇస్తే గౌరవంగా ఉంటుంది. 

 Image result for sunkara venkateswara rao 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారూ !

నమస్కారం,

ఉభయకుశలోపరి,

తమరు గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాన్నే వ్రుత్తిగా నమ్ముకుని జీవిస్తూ హైదరాబాదులో నివాసం ఉంటున్న మీరు నేడు హైదరాబాదు నగరాన్ని వదిలి అమరావతి వెళ్ళడానికి మీరు పడుతున్న వేదన మాకు అర్ధం అయ్యింది. మీరు కీశే ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతులతో ఆయన దివ్య ఆశీస్సులతో కోట్ల సంపదతో అనుచరగణంతో అధికారములో ఉండి శత్రుదుర్భేధ్యమైన రక్షణలో ఉన్న మీరే ఉద్వేగానికి లోనై కళ్ళనీళ్ళ పర్యంతమైతే, మిమ్మల్ని మీలాంటి సీమాంధ్ర నాయకుల్ని నమ్ముకుని ఇన్నేళ్ళుగా హైదరాబాదులో నివసిస్తున్న సామాన్యులం కష్టజీవులం మేము, ఎవరి అండదండలు లేకుండా మా కష్టార్జితాన్ని మా స్వేదాన్ని మా అద్రుష్టాన్ని నమ్ముకుని చిన్నాచితకా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబేట్టుకుని బ్రతుకుతున్న మమ్మల్ని మా బ్రతుకుల్ని మీరు మీ రాజకీయ స్వార్ధానికి కేసీఆర్ కుటుంబానికి తాకట్టుపెట్టి వెళ్ళిపోయారు ( పారిపోయారు ) కదా సార్ ! ఇక మేమెంత ఏడవాలి ? మరి మా జీవితాలకు దిక్కెవరు ? మా మానప్రాణాలకు ఆస్తులకు భరోసా ఎవరు ? హైదరాబాదులోని మా ఆస్థులు మీ ఆస్తుల్లాంటివి కాదు సార్, మీ రాజకీయ నాయకుల్లాగా మాకు మా ఆస్తులు ఊరకనే రాలేదు సార్, మా ఆస్తులలో మా స్వేదం ఉంది, మా కష్టం ఉంది, మా పెళ్ళాం పిల్లల ఆశలు ఉన్నాయి, వాటిల్లో మా జీవితం ఉంది సార్. ఇక మేమెంత ఏడవాలి. సార్ ?

మిమ్మలని నమ్మినందుకు, మీరు మాకు కొండంత అండగా ఉన్నారులే ధీమాతో ఉన్నందుకు మీరు మా బ్రతుకులిని అర్ధరాత్రి రోడ్లపాలుచేసి వెళ్ళిపోయారు సార్. ఇక మేమెంత ఏడవాలి సార్ ?

హైదరాబాదులో బ్రతుకుతున్న నలభై లక్షలమంది జీవితాల్ని మీ సీమాంధ్ర రాజకీయనాయకులు మీ స్వార్ధ రాజకీయం కోసం నిర్ధాక్షిణ్యంగా చిదిమేసారు సార్, ఇక మేమెంత ఏడవాలి ?

మేము ఏమి పాపం చేసాం సార్ ?

మేము ఎవరికి అన్యాయం చేసాం సార్ ?

 మేము జీవితాంతం ఇక్కడ కొందరి మాటలు బూతులు పడాల్సిన ఖర్మ మీవలన మాకు ఎందుకు సార్ ?

అందుకు మేమెంత ఏడవాలి సార్ ?

మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మి పదేళ్ళ పాటు హైదరాబాదు రోడ్లమీద సమైక్య ఉద్యమాన్ని నడిపిన మమ్మల్ని మా బ్రతుకుల్ని గాలికొదిలేసి వదిలేసి అవకాశవాదుల్ని దళారీలను వెంటేసుకుని మీరు అమరావతి వెళ్ళిపోయారు కదా సార్, అందుకు జీవితాంతం మేమెంత ఏడవాలొ కదా సార్ ?

మేమూ మీలాంటి మనుషులమే కదా ?

మావి జీవితాలు కావా ?

మాకు సెంటిమెంట్లు ఉండవా ?


(సుంకర వెంకటేశ్వరరావు (సువెరా/ఎస్విఆర్))


Image result for sunkara venkateswara rao


Image result for Over Night chandrababu left oit of Hyderabad

మరింత సమాచారం తెలుసుకోండి: