ఇటు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు... అటు దేశ ప్ర‌యోజ‌నాలు వెరసీ ఇద్ద‌రు ప్ర‌ధానులు స్పంద‌న‌. ఇప్పుడు అన్ని దేశాలు ఆ ఇద్ద‌రు ప్ర‌ధాన మంత్రుల స్పంద‌న కోస‌మే వేచి చూస్తున్నారు. ఇద్ద‌రు పీఎం లు సంప్ర‌దింపులు, శాంతి చ‌ర్చలు ఎలా ఉన్నా... రాద‌నుకున్న ముప్పు రానే వ‌చ్చింది. జ‌ర‌గ‌రాన్ని న‌ష్టం జ‌రిగిపోయింది. ఇక రాజ‌కీయ నాయకులు క‌దా, పైగా దేశ ప్ర‌ధానులు ఎదో ఒక‌టి స్పందించ‌క త‌ప్ప‌ద‌నుకున్నారో ఏమో తెలియ‌దుకానీ ఎట్ట‌కేల‌కు ఘ‌ట‌న జ‌రిగిన వారం రోజుల‌కు ఆచి తూచి స్పందించారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్రమోడీ, పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీష్. మ‌రీ వీరి స్పంద‌న ఒక్క‌సారి గ‌మ‌నిస్తే... 

యూరీ దాడిపై మోడీ స్పంద‌న‌...

భార‌త ప్ర‌ధాని న‌రేంద్రమోడీ.... జ‌మ్మూ క‌శ్మీర్ యూరీ ఆర్మీ సెక్టార్ లోని ఆర్శీ స్థావ‌రం పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల దాడి జ‌రిగిన వారం రోజుల‌కు మొద‌టి సారిగా స్పందించారు. కేర‌ళ కోజికోడ్ లో బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాల్లో భాగంగా బ‌హిరంగ స‌భ లో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ యూరీ ఘ‌ట‌న పై విరుచుకుపడేలా  చేశారు. 21 వ శ‌తాబ్దం ఆసియాది కాకుండా చేసేందుకు పాక్ య‌త్నిస్తోందని స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదంతో దేశం ర‌క్త సిక్తమ‌వ్వాల‌ని పాకిస్థాన్ కోరు కుంటుంద‌ని వివ‌రించారు. అమాయకుల‌ను బ‌లి తీసుకుంటూ పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని మోడీ తెలిపారు. ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు అంతా ఐక్య‌మై పోరాడాల‌న్నారు.

యూరీ ఉగ్ర‌దాడికి త‌గిన జ‌వాబు త‌ప్ప‌దు: మోడీ

యూరీలోని ఆర్మీ  స్థావ‌రంపై ఉగ్ర‌వాద దాడిని ఎప్ప‌టికీ మర‌చిపోమ‌ని... తగిన జ‌వాబు చెబుతామ‌ని మోదీ పాక్ ను ఉద్దశించి  హెచ్చ‌రించారు. ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడిలో 18 మంది సైనికులు చనిపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నారు. దేశాన్ని కాపాడే క్రమంలో 18 మంది సైనికులు ఆత్మత్యాగం చేశారని చెప్పారు. ఈ  యుద్దంలో ఎవ‌రు గెలుస్తారో చూద్దామ‌ని పాక్ కు స‌వాల్ విసిరారు. అంతేకాకుండా ఆయ‌న పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అభివృద్ధి, వికాసం  కోసం పోరాడాద‌మ‌న్నారు. పాకిస్థాన్ లో దేశీయంగా ఉన్న ఉగ్ర‌వాదం పై పోరాడాల‌ని ఆ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

యుద్ధానికి వెన‌కాడే ప్ర‌సక్తే లేదు

ఇంత‌వ‌ర‌కు భాగానే ఉన్నా... ఉగ్ర‌వాదం పై ప్ర‌త్య‌క్ష యుద్దం చేయాల‌ని మాత్రం పూర్తి స్థాయిలో స్పందించ‌లేదు. వాస్త‌వానికి భార‌తదేశానికి ఇప్ప‌టికిప్పుడు యుద్దం అంటే అంత మంచిది కాద‌ని నిపుణులు వారిస్తున్నారు. ప్ర‌పంచ‌దేశాల‌తో ఆర్ధిక వ్య‌వ‌స్థ లో పోటీ ప‌డుతున్న నేప‌థ్యంలో యుద్దం అంటే కొంచెం న‌ష్ట పోయే అవ‌కాశాలు ఉన్నాయి. అప్ కోర్స్ అనివార్య ప‌రిస్థితులే వ‌స్తే యుద్ధానికి వెన‌కాడే ప్ర‌సక్తే లేద‌ని మోడీ నాటి నుంచి తెలుపుతున్నారు. తాజాగా అదే విషయాన్ని ఇరు దేశాల‌ను ఉద్దేశించి వివ‌రించారు కూడా. మ‌రి ఇప్ప‌టికిప్పుడు యుద్దం వ‌స్తే భార‌త సైన్యం సంసిద్ద‌త ఉంద‌న్న చెప్ప‌డంలో సందేహం లేదు. అంతేస్థాయిలో దేశ ప్ర‌జ‌లు సైతం పాక్ ఆగ‌డాల‌కు విసిగి పోయారు. ఇక‌పోతే కేవలం మోడీ ప్ర‌సంగంతో పాక్ కు బుద్ది వ‌స్తుంద‌ని కూడా ఊహించ‌లేం. 

యూరీ దాడిపై పాక్ ప్ర‌ధాని స్పంద‌న‌

ఇదీలా ఉంటే... గ‌తంలో లాగానే పాకిస్థాన్ త‌మ వ‌క్ర‌బుద్దిని చూపించుకుంది. మేం చేసింది ఏమీలేదు. మీరు కావాల‌నే చేసుకున్నార‌ని పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ అన్నారు. జ‌మ్ము క‌శ్మీర్ లో భార‌త్ చేసిన అకృత్యాల వల్లే యూరీ దాడి జ‌రిగింద‌ని... క‌శ్మీర్ లో అమాయ‌క పౌరులను భార‌త్ పొట్ట‌న‌పెట్టుకుంటోంద‌ని, వాటి ప్ర‌తిస్పంద‌నే యూరీ ఘ‌ట‌న‌కు కార‌ణమంటూ సెల‌విచ్చారు. ఐక్య రాజ్య స‌మితి స‌మావేశాల్లో పాల్గొని తిరిగి వెళ్తూ ఆయ‌న లండన్ లో విలేక‌రుల‌తో మాట్లాడారు. యూరీ ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదుల దాడిపై ఎలాంటి ఆధారాలు లేకుండానే, ఎలాంటి విచారణ జరపకుండానే భారత్ పాక్‌ను అనుమానిస్తోందని నవాజ్ ఆరోపించారు.

యూరీ దాడికి మాకేలాంటి సంబంధం లేదు: న‌వాజ్

పాక్ ఇప్పుటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్ర‌దాడులు జ‌రిగినప్పుడ‌ల్లా ఇదే సిద్ధాంతాన్ని అవ‌లంభిస్తోంది. గ‌తంలో పార్ల‌మెంట్ దాడి నుంచి ముంబాయ్ దాడి, పంజాబ్ దాడి, తాజాగా యూరీ దాడి ఇలా చెప్పుకుంటు పోతే దాదాపుగా అన్ని దాడికి  మాకు ఏలాంటి సంబంధం లేద‌ని... కావాల‌నే భార‌త్ త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చెబుతూ వ‌స్తోంది. అయితే దాడి జ‌రిగిన‌ప్పుడ‌ల్లా పాక్ నుంచే వ‌చ్చార‌న్న పూర్తి స్థాయిలో సాక్షాధారాలు దొరికినా... పాక్ మాత్రం మాకేలాంటి సంబంధం లేద‌ని చెబుతుంది. తాజాగా మ‌రోసారి న‌వాజ్ ఇదే స్థాయిలో స్పందించ‌డంతో  భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణిచ‌డం ఖాయ‌మ‌ని  నిపుణులు ఉదాహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: