యూరీ ఘటన భారత దేశం లో ప్రతీ ఒక్కరినీ కదిలించింది . పాకిస్తాన్ మీద మనదేశం తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఫీలింగ్ ని అందరిలో సృష్టించిన ఘటన ఇది. పాకిస్తాన్ మీద తీవ్రమైన ఆగ్రహావేశాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందే అంటూ జనం మండి పడుతున్నారు. ఈ తరుణం లో మోడీ సర్కారు ఎక్కడా తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం లేదు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ని దోషిగా అందరి ముందరా నిలబెట్టడం లో సక్సెస్ అయ్యింది మన సర్కారు. మరొక పక్క మోడీ మంతనాలతో పాటు సైనిక చర్యల మీద ఆయన రచిస్తున్న కదలికలు కొత్త ఊహగానాలకి తావు ఇస్తున్నాయి. త్రివిధ దళాల తో మోడీ రీసెంట్ గా కలిసి సుదీర్ఘంగా గంటల పాటు చర్చించారు.

ఆయన అధికార నివాసం లో ఆర్మీ, నేవీ , వాయుసేన అధిపతుల తో చాలా సేపు మాట్లాడిన మోడీ సుదీర్ఘ చర్చ నడిపారు. పాకిస్తాన్ ని తెలివిగా దెబ్బ తీయడం మీద, వారు మరొక సారి ఇలాంటి దుస్సాహసం చెయ్యకుండా ఎలాంటి ప్లాన్ లు వెయ్యాలి అనే విషయం మీద నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ రకరకాల అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వేదిక గా పాకిస్తాన్ ని పేరుపెట్టి మరీ ఉగ్రవాద దేశం గా భారత్ దాడి చెయ్యడం మామూలు విషయం కానే కాదు. కాశ్మీర్ పైన జోక్యం చేసుకోవాలి అనే పాక్ ప్రధాని విన్నపాన్ని ఐరాస భేషరతు గా తిరస్కరించింది. పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశం గా ప్రకటించాలి అంటూ ఏకంగా అమెరికా హౌస్ ఆఫ్ కామర్స్ లో బిల్లు ప్రవేశ పెట్టడం చిన్న విషయం ఏమీ కానే కాదు. బలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్ పై ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఐరోపా యూనియన్ హెచ్చరించింది.

ఇన్ని పరిణామాలు షాకింగ్ గా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా జరగడం ఇదే మొట్ట మొదటి సారి అని చెప్పాలి. ఎన్నోసార్లు మనమీద దాడి జరిగినా కూడా ఈ రేంజ్ లో వారికి వ్యతిరేకంగా పరిస్థితి ముందుకు కదలలేదు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టిన తరవాత పర్మితగా భారత సైనిక చర్య దిగవచ్చు అనేది ఒక అంచనా. కేరళలోని కోజికోడ్ సభలో శనివారం మోడీ ప్రసంగం గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. పాకిస్తాన్ ప్రజలని తమ సైన్యం మీదా , తమ పాలకుల మీదా తిరగబడమని కోరుతున్నారు మోడీ. ఒకేసారి స్వతంత్రం పొందిన రెండు దేశాలూ ఎందుకు ఇలాంటి తేడాలతో , వైషమ్యాలతో , అభివృద్ధి చెందుతూ - అభివృద్ధి చెందలేని దేశాలుగా మిగిలిపోయాయి అనేది వారి పాలకులని అడగమని పాకిస్తాన్ ప్రజల్లో ఆసక్తి రేపుతున్నారు మోడీ.

పాకిస్తాన్ అంటే కేవలం అసహ్య భావం కాకుండా అక్కడ ప్రజలు కూడా మనలాంటి వాళ్ళే అనేది గుర్తు చేస్తున్నారు మోడీ. యురీలో 18 మంది జవాన్ల బలిదానం వృథా కాదని కూడా హెచ్చరించారు. అంటే పాక్ పై ప్రతీకారం తీర్చుకోవడం తథ్యమనే చాలా మంది భావిస్తున్నారు. అయితే అది వారి సైన్యం మీదనో , ప్రజల మీదనో కాకుండా పూర్తిగా పాలకుల మీద ఉండాలనేది మోడీ భావన కావచ్చు అందుకే ప్రజలని ఉత్తేజ పరుస్తూ వారిని రెచ్చగొడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: