లింగ సమానత లేకపోయినంత మాత్రాన మనుషుల శక్తి సమర్థ్యాల్లో ఎటువంటి తేడా ఉండదని నిరూపించి భారతావనికి ఎందరో వీర నారీ మణులను ఇచ్చిన మన దేశంలో ప్రాచీన కాలంలో లేనంతగా ఇప్పుడు లింగ అసమానత సమస్య దేశాన్ని పట్టి పీడుస్తున్నది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి, కనీస సౌకర్యాలు కుడా లేని దేశంగా దౌర్భాగ్యపు పరిస్థితులను అనుభవిస్తున్న పేద దేశాల్లో సైతం ఆడపిల్లలకు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి దేశాలను చూసినా ఆడపిల్ల పుడుతుంది అనగానే పురుటిలోనే పై లోకాలకు పంపించే కొందరు దంపతుల మనసులు మారవచ్చేమో.


Image result for child death india

లింగ అసమానతలను తొలగించడానికి భారత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను, సౌకర్యాలను, వెసులుబాటును, పథకాలను ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రమే. ప్రపంచానికే వీర నారీ మణులను పరిచయం చేసిన మన దేశానికే ఇలాంటి పరిస్థితి దారుపించడం నిజంగా సిగ్గు చేటు. పండంటి ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంలో తల్లిదండ్రులు సంబరపడుతుంటే ఇంతలో పాప చనిపోయిందని వైద్యులు చెప్పారు. దాంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు శ్మశానంలో పూడ్చిపెడుతుండగా పాప ఏడ్చేసింది.


Image result for child death india

ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరీదాపూర్‌కి చెందిన గలీబా హయత్‌ నజ్నీన్‌ అక్తర్‌ దంపతులకు గత గురువారం ఆడపిల్ల పుట్టింది. పాప పుట్టిన రెండు గంటలకే చనిపోయిందని వైద్యులు చెప్పారు. పాప వారికి తొలి సంతానం కావడంతో కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం ఉదయం పాపను పాతిపెట్టబోతుండగా ఒక్కసారిగా పాప గుక్కపెట్టి ఏడ్చేసింది. వెంటనే తల్లిదండ్రులు పసికందును స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కానీ వారికంత స్తోమత లేక పాపని అక్కడే ఉంచేశారు. శనివారం పాప చికిత్సకు కావాల్సిన ఖర్చుతానే భరిస్తానని ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అంతేకాదు పాపను హెలికాప్టర్‌లో ఢాకాలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: