ద‌స‌రా పండగ వ‌చ్చిదంటే తెలంగాణ యావ‌త్ మ‌హిళమ‌నులు ఆశ‌క్తి గా చేసుకునే వేడుక‌లేవంటే ముమ్మాటికి బ‌తుకమ్మ వేడుక‌లేన‌ని చెప్పాలి. తెలంగాణ సాంస్కృతికి ప్ర‌తిక‌గా నిలుస్తున్న బ‌తుక‌మ్మ పండుగ ఇప్పుడు ప్ర‌పంచ‌మంతంటా జ‌రుపుకుంటున్నారు. ఇందుకు కార‌ణం ఎవ‌ర‌ని అడిగితే క‌ల్వ‌కుంట్ల క‌విత నే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త తొమ్మిదేళ్లుగా తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు , ఆధ్య‌క్షురాలు, సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈ బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ‌లోని 109 నియోజ‌క వ‌ర్గాల్లో సెప్టెంబ‌ర్ 30 నుంచి తొమ్మిది  రోజుల పాటు బ‌తుకమ్మ సంబురాల‌ను జ‌రుప‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ క‌విత ఓ ఛాన‌ల్ తో త‌న గ‌త‌ అనుభవాల‌ను పంచుకున్నారు. అందులో కొన్ని అంశాలు...

ఉద్య‌మ‌కాలంలో మొద‌లైన బ‌తుక‌మ్మ‌

తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో నిర్విరామంగా ఉద్య‌మాల‌లో పాల్గొంటున్న స‌మ‌యంలో... ఉద్య‌మాల్లో పాల్గొన‌డానికి ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళ‌ల్లో 90 శాతం మంది... ఇంట్లో ఒత్తిడి తోనో, మ‌రే కార‌ణాల‌తోనో వెన‌క్కి త‌గ్గారు. ఈ విష‌యాల‌ను గ‌మ‌నించిన క‌ల్వ‌కుంట్ల క‌విత... ఏదైనా సాంస్కృతిక అంశంతో వీరంద‌రిని క‌లుపుకోవాల‌ని భావించారు. అప్పుడే నాటి బాల‌గంగాధ‌ర్ తిల‌క్ గురించి తెలుసుకున్న ఆమె బ‌తుక‌మ్మ చ‌రిత్ర‌నూ లోతుగా ఆధ్య‌య‌నం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో యువ‌తీ యువ‌కుల భాగ‌స్వామ్యం పెంచ‌డానికి గ‌ణేష్ న‌వ‌రాత్రుల‌ను ఆయ‌న కేంద్రంగా చేసుకున్నార‌నే విష‌యం గురించి చిన్న‌ప్పుడే చదువుకున్న క‌విత‌... ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి బ‌తుక‌మ్మ‌ను తెర పైకి తెచ్చారు.

బ‌తుక‌మ్మ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం

అయితే ఈ క్ర‌మంలో ఎవ‌రినీ నొప్పించ‌కుండా... ఈ పండుగ ద్వారా తెలంగాణ‌లోని అంద‌రినీ క‌లిపి ఉద్య‌మంలో భాగ‌స్వాములుగా చేయాల‌ని భావించి.... అస‌లు ఈ పండుగ ఏంటి? మ‌తానికి సంబంధించిన‌దా? స‌ంస్కృతిక సంబంధించిన‌దా? అనే కోణంలో కూడా అధ్య‌య‌నం చేశారు. ఈ పండుగ పూర్తిగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన‌ది... తెలంగాణ ప్ర‌జ‌ల జీవితంలో భాగం,  అంతేకాకుండా ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా ఉండే పండ‌గ‌. కాబ‌ట్టి ధైర్యంగా ముందుకు పోయినని తెలిపారు క‌విత‌. తెలంగాణ ప్రాంతంలో మ‌హిళ‌లు ఒక‌రి త‌రువాత  ఒక‌రు... ఒక‌రిని చూసి ఒక‌రు సంతోషంగా మా బ‌తుకమ్మ వేడుక‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడు బ‌తుక‌మ్మ మ‌న పండుగ‌... మ‌న సంస్కృతి. అంతేకాకుండా... మ‌న ల‌క్ష్యం కూడా ఒక‌టుంది, అదే తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. కొబ‌ట్టి  బ‌తుక‌మ్మను తెచ్చేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు దాని  మీద జై తెలంగాణ అనే జెండా పెట్టుకొని రావ‌డం మొద‌లు పెట్టారు.

బ‌తుక‌మ్మ పండుగ తెలంగాణ ఉద్య‌మ స్పూర్తి ని చాటింది

అలా బ‌తుక‌మ్మ పండ‌గ తెలంగాణ ఉద్య‌మ స్పూర్తిని చాటింది. అంటే తిట్ట‌డం, కొట్టడం, అర‌వ‌డం లేకుండా విన‌యంగానే చాలా బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్న‌మ‌న్న‌మాట‌. ఇక తెలంగాణ జాగృతి విష‌యానికి వ‌స్తే... జాగృతి సైద్దాంతిక‌త‌. పేరు ద‌గ్గ‌ర్నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ చేయాల‌నే నిర్ణ‌యాల దాకా అన్నీ క‌విత సొంతంగా తీసుకున్న నిర్ణ‌యాలే. ప‌ది మంది స‌ల‌హాలు తీసుకుని ప‌ది మందిని సంప్ర‌దించి చేస్తే... అది వాళ్ల అనుభ‌వంలో వ‌చ్చింద‌వుతుందని క‌విత గట్టిగా న‌మ్ముతారు. బ‌తుక‌మ్మ సంబురాలు చేసే విష‌యంలో కూడా నేను నాన్న గారిని అనుమ‌తి అడ‌గ‌లేదు. సూచ‌న‌లు అంత‌క‌న్నా అడ‌గ‌లేద‌ని తెలిపారు కవిత‌. కానీ జ‌యశంక‌ర్ సర్ తో నిత్యం మాట్లాడటం ఉండేది. ఆదీ కూడా తెలంగాణ కు సంబంధిచి సాధార‌ణ సంభాష‌ణే త‌ప్ప ప్ర‌త్యేకించి స‌ల‌హాలు కోస‌మైతే కాదన్నారు.

2001 లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం

ఇక‌పోతే.. 2001 లో నాన్న‌( కేసీఆర్) పార్టీ పెట్టిన‌ప్పుడు... మేము ఎక్క‌డో బ‌య‌ట సెటిల్ అయ్యాం. అయితే మాకు కూడా అప్పుడు  తిరిగి వెన‌క్కి రావాల‌ని, ఏదో చేయాల‌నే ఆలోచ‌న లేదు. కానీ.. 2005, 06 సంవ‌త్స‌రంలో తెలంగాణ మూవ్ మెంట్ పీక్ కి వెళ్తోంది. అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి  స‌వాళ్లు  విసురుతూ అడుగ‌డుగునా తెలంగాణ ఉద్య‌మానికి ప‌రీక్ష‌లు పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. అంటే... కేసీఆర్ లేక‌పోతే ఉద్యమం ఉండ‌దు. అందుకే ఈ ఉద్య‌మం నుంచి కేసీఆర్ ను త‌ప్పించాల‌నే వార్త బాగా వ‌చ్చింది. అప్పుడు నాలాంటి ల‌క్ష‌లాది  తెలంగాణ బిడ్డ‌లు బాగా ప్ర‌భావితం అయ్యి తెలంగాణ కోసం, టీఆర్ఎస్ కోసం, కేసీఆర్ కోసం పనిచేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో నేను ఇండియా వ‌చ్చానన్నారు క‌విత‌.

ఉప ఎన్నిక‌ల్లో పాల్గొన్న క‌విత‌

నాన్న(కేసీఆర్) ఉప ఎన్నిక‌ల్లో ఉన్నారు. అవ్నీ చూశాక అనిపించింది... బ‌య‌ట నుంచి ఎవ‌రెవ‌రో ఇంత స‌పోర్టు ఇస్తున్నారు. చేయ‌గ‌ల శ‌క్తి ఉండీ ఏం ప‌ట్ట‌న‌ట్టుగా నేను ఇంట్లో కూర్చొవ‌డ‌మేంటని భావించిన క‌విత‌... కేసీఆర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం లో పాల్గొన్నారు. కేసీఆర్ కు ముప్పై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో అంత‌కు ముందెప్పుడూ అలా ఆయ‌న ఎన్నిక‌ల ప్రచరానికి వెళ్ల‌లేద‌ని తెలిపారు క‌విత‌. కేవ‌లం ఓ ఉద్య‌మ‌కారుడికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే ఆ ఉప ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్నాన‌న్న క‌విత‌... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావ‌డానికి ఎంత మంది వీలైతే అంత మంది ఉద్య‌మంలోకి వ‌స్తే తప్ప సాధ్యం కాదని అనుకుని ఉద్య‌మంలో క్రీయాశీలంగా పాల్గొన‌డం జ‌రిగింద‌ని తెలిపారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. 

ఇందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను

అయితే ఉప ఎన్నిక ప్రచారంలో చాలా రోజుల తరువాత గ్రామాల‌కు వెళ్ల‌డం... గ్రామీణ జీవితాన్ని... అక్క‌డి పేద‌రికాన్ని ద‌గ్గ‌ర‌గా చూడ‌డం.. ప్ర‌జ‌లంతా.... తెలంగాణ సాధ‌న లో మా అంద‌రి మ‌ద్ద‌తు ఉంటుంది కానీ... వ‌చ్చాక మా జీవితాల‌కు ఓ భరోసా కావాల‌ని... క‌నీసం నెల‌కు ఒక్క వెయ్యి రూపాల‌య సంపాదించుకునే వీలున్నా మా లైఫ్, మా పిల్ల‌ల లైఫ్ బాగుంటుంద‌ని చాలా ద‌య‌నీయంగా అనిపించిదన్నారు క‌విత‌. క‌నీసం ఓ స్వ‌చ్చంద సంస్థ‌ను పెట్టినా ఓ ప‌ది మందికి ఉపాధి క‌లిగించగ‌ల్గుతానేమోన‌ని... ఇంకో ప‌ది మందికి నేరుగా స‌హాయం చేయ‌గ‌ల‌నేమో... అయితే రాజ‌కీయ ఉద్య‌మం త‌ప్ప‌నిస‌రి భావించిన క‌విత‌... టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున నిజామాబాద్ ఎంపీగా పోటీ దిగాల్సి వచ్చింద‌ని క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అలా 9 ఏళ్లుగా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తూ వస్తున్నారు క‌విత‌.

మరింత సమాచారం తెలుసుకోండి: