పేరుకు భక్తి.. చేసేందంతా రక్తి.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు గురించి సింపుల్ నిర్వచనం. ఆధ్యాత్మికం పేరుతో యువతులు, మహిళలను ఆకర్షించడం వారితో వెకిలి చేష్టలు చేయడం ఆయనకు బాగా అలవాటు. ఇలాంటి ఆరోపణలు ఆయనపై ఎన్నో ఉన్నాయి. ఓ బాలికపై లైంగిక వేధింపుల కేసులో 2013 సెప్టెంబర్ నెలలో అరైస్టైన 74 ఏళ్ల ఆశారాం.. ఇప్పటికీ తీహార్ జైలులోనే ఉన్నాడు. మూడేళ్లుగా చిప్పకూడు తింటున్నా తనలో రసికత ఏ మాత్రం తగ్గలేదని అంటున్నాడు. తాజాగా వైద్య పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకురాగా.. నర్సుతో వెకిలి చేష్టలు చేసి మరోసారి వార్తల్లో కెక్కాడు ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు.


తీహార్ జైల్లో ఉన్న ఆశారాం బెయిల్ పిటీషన్ కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు పరిశీలనకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య స్థితిని తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో.. నడవలేని స్థితిలో ఉన్న ఆశారాం బాపును ఢిల్లీ ఎయిమ్స్ కు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకువచ్చారు. అక్కడ నర్సులను చూడగానే.. ఆశారంలోని మన్మథుడు మేల్కొన్నాడు. నడిచేందుకు కాళ్లు సహకరించకున్నా.. వీల్ చైర్ లో కూర్చునే వెకిలి చేష్టలు ప్రారంభించాడు. వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన నర్సు పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. నువ్వు వెన్నపూసలా ఉన్నావు. నీ బుగ్గలు కశ్మీర్ యాపిల్స్ లా ఉన్నాయంటూ పిచ్చి పిచ్చిగా వాగాడు. అంతటితో ఆగకుండా.. తనను యువకుడిగా మారేలా చికిత్స చేయాలని అక్కడి వైద్యులను కోరాడు. మూలనపడిన వయసులోనూ ఆశారాం చేష్టలు చూసి అవాక్కైన పోలీసులు.. ఏమీ చేయలేక వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. 


16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును ఇండోర్‌లోని ఆయన ఆశ్రమంలో 2013 సెప్టెంబర్ లో జోధ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆశారం బాబు సహా పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు. నాటి నుండి ఆశారం జైల్లోనే ఉన్నారు. ఆశారం బాపులో ఆధ్యాత్మికత, రసికతే కాదు.. నేర గుణాలు ఎక్కువే అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు. ఇందుకు బాలికపై రేపు కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒకొక్కరుగా చనిపోవడాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. ఆశారాం బాపు కేసులో సాక్షులుగా ఉన్న వారిలో ఇప్పటి వరకు 9మందిపై దాడులు జరిగాయి. ఇద్దరు చనిపోయారు. ఆశారం బాపు కేసు నుంచి తప్పుకోవాలి, లేక పోతే చంపేస్తామన్న బెదిరింపులనెన్నో సాక్షులు ఎదుర్కొన్నారు.. 


ఇక విత్తు ఒకటైతే.. చెట్టు మరొకటవుతుందా అన్నట్లు.. ఆశారం బాపునే ఇలా ఉంటే.. ఆయన కొడుకు నారాయణ సాయి.. తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. తండ్రి 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడితే.. కొడుకు ఏకంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి కొడుకులిద్దరూ సొంత అక్కా,చెల్లెళ్లను వేధింపులకు గురి చేశారు. బాపు ఆశారాంపై అక్క లైంగిక వేధింపుల కేసు పెట్టగా.. నారాయణసాయిపై చెల్లి రేప్ కేసు పెట్టింది. అత్యాచారం, అక్రమ నిర్బంధం, కుట్ర, అసహజ సెక్స్, క్రిమినల్ చర్యలు వంటి ఆరోపణలతో తండ్రికొడుకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లోని సూరత్ ఆశ్రమంలో నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.  కేసు విచారణ కూడా కొనసాగుతోంది.

దైవాంశ సంభూతుడిగా పిలిపించుకునే మామ ఆశారం బాపు సొంత కోడలిని కూడా వదల్లేదు. కొడుతో కలిసి ఆమెను శారీరకంగా మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడు. మేరకు ఆశారాం బాపు కోడలు, నారాయణ భార్య జానకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వాగ్మూలాన్ని పోలీసుల ఎదుట చెప్పింది. తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడు. వారిపట్ల చెడుగా ప్రవర్తించేవాడు. ఓ యువతిని గర్భవతిని సైతం చేశాడు. యువతి నిలదీసేసరికి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే తనకు విడాకులు ఇచ్చాకే ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పినట్లు ఆమె తెలిపింది. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని పోలీసులకు వెల్లడించింది. 


బాబాలంతా ఆశారం బాపులా ఉండకపోయినా.. భక్తి మాటున అరాచకాలు జరిగే అవకాశం ఉంది. సో.. అలాంటి వాటికి ఆస్కారమివ్వకండా.. అప్రమత్తంగా ఉండాలని చెప్పేందుకు ఆశారాం ఘటన ఓ ఉదాహరణ మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: