ఆంధ్ర‌ప్ర‌దేశ్ రావ‌ల‌సిన ప్రత్యేక హోదా పై భారీ యుద్దాన్నే ప్ర‌క‌టిస్తూ వస్తోంది ప్ర‌తిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర స‌ర్కార్ ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీ ని నిర‌సిస్తూ... ఏపీ లో ప‌లు ప్రాంతాల‌ను వేదికగా చేసుకుని ఉద్య‌మ‌బాట ప‌ట్టిన వైకాపా... తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ప్ర‌త్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే ఎంపీల రాజీనామా అనే బ్ర‌హ్మాస్త్రాన్ని కూడా ప్ర‌యోగిస్తామ‌ని ప్ర‌తిప‌క్ష‌నేత , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నిన్న ఆ జ‌రిగిన ప్ర‌వాసాంధ్రుల‌త ముఖాముఖి లో జ‌గ‌న్ ఆంద్ర‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి స్పందించారు. ప్ర‌త్యేక హోదా ఏపీ అనివార్య‌మ‌ని, హోదా వ‌స్తేనే ఏపీ దేశంలో ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు.

వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఇక ప్ర‌త్యేక హోదా కోసం ద‌శ‌ల‌వారీ పోరాటం సాగిస్తామ‌ని... అందులో భాగంగా తుదిద‌శ‌లో అవ‌స‌ర‌మైతే ఎంపీల చేత రాజీనామా లు కూడా చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా... ఏపీ లో ఉప ఎన్నిక‌ల‌కు సిద్దమ‌ని తెలిపారు. అయితే ఇక్క‌డ వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా? అన్న‌ది అంద‌రికి మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌. వాస్త‌వానికి సీమాంధ్ర లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య మొత్తం 25 అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న‌ది 8 సీట్లు. ఇందులో పూర్తి స్థాయి మెజారిటీ టీడీపీ-బీజేపీ కే ఉంది. అయితే దేశంలో ఏ పార్టీ కి రానీ మెజారిటీతో కేంద్ర బీజేపీ స‌ర్కార్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇందులో వైకాపా కాదు క‌దా... క‌నీసం టీడీపీ ఎంపీ ల అవ‌స‌రం కూడా కేంద్రానికి లేదు. 

పార్లమెంట్ సాక్షిగా హోదా పై వైకాపా ఎంపీల ధ‌ర్నా

కానీ 2014 ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీయైన టీడీపీ తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో వారికి కొంత వ‌ర‌కు గుర్తింపు  ల‌భించ‌ద‌నే చెప్పొచ్చు. అయితే ఇక్కడ వైకాపా 8 ఎంపీలు లోక్ స‌భ‌లో ఉన్నా... పెద్ద‌గా ప్ర‌యోజ‌న‌మే లేదని చెప్పొచ్చు. ఇందుకు ఓ ఉదాహార‌ణ మీముందు ఉంచుతాను... గ‌త లోక్ స‌భ వర్ష కాల‌పు స‌మావేశాల్లో ప్ర‌త్యేక హోదా విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లును పెట్టితే దానిని నిర‌సిస్తూ కేవ‌లం ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని లోక్ స‌భ స‌మావేశాల‌ను బైకాట్ చేశారు. అయినా ప్ర‌త్యేక హోదా పై కేంద్రం మాత్రం త‌మ‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుందే త‌ప్ప... వైకాపా ఎంపీల నిర్ణ‌యాన్ని మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. 

రాజీనామాల‌తో హోదా వ‌స్తుందా

అయితే తాజాగా జ‌గ‌న్ త‌న రాజ‌కీయ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం కానీ... ఎంపీల రాజీనామా తో ఉప ఎన్నిక‌లు రావొచ్చే త‌ప్ప‌... ఒరిగేదేమీలేదు. అప్ కోర్స్... ప్ర‌స్తుతం రాజకీయ ప‌రిణామాల దృష్ట్యా మ‌రోసారి ఉప ఎన్నిక‌లు జ‌రిగితే  వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే ఇక్క‌డ‌ రాజీనామాలతో ప్రత్యేక హోదా కు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో  కేంద్రానికి, దేశ ప్ర‌జ‌ల దృష్టికి తీసుకు వెళ్లే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ మ‌రో విష‌యం గ‌మ‌నించాలి. సీమాంధ్ర లో ప్ర‌త్యేక హోదా డిమాండ్ న్యాయమైన‌దిగా చెప్పొచ్చు. గ‌త ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న నాటి నుంచి ప్ర‌జ‌లు త‌న రాష్ట్రాన్ని అన్యాయం గా విభ‌జించార‌ని... మా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం స‌హ‌కరించాల‌ని తెలుపుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే నాటి కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న చ‌ట్టం లో ఏపీ కి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని పొందు పరిచారు. 

వైఎస్ జ‌గ‌న్ స్టాటెజీ ఎంటీ....

అయితే 2014 నాటి రాజకీయ ప‌రిణామాల‌తో బీజేపీ స‌ర్కార్ ఆ హోదాను అమ‌లు చేయ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్తవం. ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ కాంగ్రెఎస్ పార్టీ ప్ర‌త్యేక హోదా పై యుద్దాన్నే ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నాయి. అయితే గ‌త రాజ‌కీయాల ను గ‌మ‌నిస్తే రాజీనామాలో కొంత వ‌ర‌కు మార్పు రావొచ్చే త‌ప్ప పూర్తి స్థాయిలో మార్పు జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేం. అందులో ఇప్పుడున్న వైకాపా బ‌లాన్ని గ‌మ‌నిస్తే అది సాధ్యం కాద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఇక్క‌డ వైఎస్ జ‌గ‌న్ స్టాటెజీ ఎలా ఉందో తెలియ‌దు కానీ... ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం కొంత వ‌ర‌కు రాజ‌కీయంగా ఆయ‌నకు బూస్ట్ నివొచ్చు.

ఉప ఎన్నిక‌ల్లో వైకాపా గెలుపు త‌ధ్యం?
  
ఇక జ‌గ‌న్ మరోసారి రాష్ట్ర పార్టీ ఫిరాయింపు రాజకీయాల‌ను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్ర‌బాబు పై ఆయ‌న గ‌ట్టి షాకే ఇచ్చారు. ప్ర‌లోభ పెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యే ల చేత రాజీనామా చేయించి... ఉప ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని వ‌చ్చే ఫలితాల‌ను రిఫ‌రెండంగా భావిద్దామ‌ని పేర్కొన్నారు. అంతే కాదు త‌మ పార్టీలో చేరితే వారి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ధామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే ఇక్క‌డ మాత్రం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం మాత్రం సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. నిజానికి ఇప్ప‌టికిప్పుడు ఉప ఎన్నిక‌ల జ‌రిగితే మాత్రం వైకాపా గెలుపుకే ఎక్కువ శాతం చాన్స్ ఉంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన చంద్ర‌బాబు నాటి నుంచి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాలే కానీ... ఏర్పాటు చేసిన ప‌థ‌కాలే గానీ... క్షేత్ర స్థాయిలో విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పొచ్చు. 

ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు వైఫ‌ల్యం

గ‌డిచిన రెండున్న‌రేళ్ల కాలంలో ఆయ‌నకు అన్ని విభాగాలలో తీవ్ర వ్య‌తిరేక‌తే ఉంది. ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం కూడా గ‌ట్టి దెబ్బె. ఈ క్ర‌మంలో చంద్రబాబు ఎన్నిక‌ల క్షేత్రంలోకి వెళ్లితే మాత్రం ఆయ‌న‌కు చుక్కెదురే అవుతుంది. అయితే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగే రాజ‌కీయా ప‌రిణమాల‌ను ఉహించ‌లేం కానీ...  వైకాపా ఎంపీల‌, ఫిరాయింపుల ఎమ్మెల్యేల రాజీనామా తో మాత్రం రిఫ‌రెండంగా జ‌గ‌న్ గెలుపు మాత్రం ఖాయమ‌నేది నిర్వివాదాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: