కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఘోర అవమానం జరిగింది. ఆయన గత కొన్ని రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్లి ఎన్డీఏ పానలకు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.  ఇక  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తు ప్రచారానికి వెళ్తున్న రాహుల్ గాంధీకి చేదు అనుభవం జరిగింది.   ఉత్త‌రప్ర‌దేశ్‌లోని సీతాపూర్‌లో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీపైకి ఓ స్థానికుడు బూటు విసిరాడు.  అయితే ఆ బూటు దాడి నుంచి రాహుల్ గాంధీ తృటిలో తప్పించుకున్నాడు.  సాధారణంగా ప్రచారాలకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లడం చూస్తుంటాం.

అయితే ఈ రోజు రాహుల్ గాంధీ కూడా ఓపెన్ టాప్ జీపులో ప్రచారం నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా స్థానికుడు విసిరిన బూటు రాహుల్ వెనుకనే ఉన్న వ్యక్తి చేతిని తాకింది. త‌న‌వైపు బూటు విస‌ర‌డాన్ని రాహుల్‌గాంధీ గ‌మ‌నించి పక్కకు తప్పుకున్నారు. వెంటనే తేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితక బాదడానికి ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు  రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

ఈ దాడికి పాల్ప‌డిన హరి ఓమ్ మిశ్రా అనే వ్యక్తిని పోలీసులు వెంట‌నే అరెస్ట్ చేశారు. యూరి దాడిలో 18 మంది జవాన్లు చనిపోతే కనీసం సంతాపం తెలపని రాహుల్ గాంధీ.. ఇప్పుడు కేవలం ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని ఆరోపించాడు. ఈ మద్య కొంత మంది నిరసన కారులు ఈ రకంగా చెప్పులు, బూట్లు , బ్లాక్ ఇంక్ లు  విసురుతూ తమ నిరసన తెల్పడం సర్వ సాధారణం అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: