ఎడతెగని వర్షాల బాధ హైదరాబాద్ ని పట్టి పీడిస్తోంది. హైదరాబాద్ మహానగరం లోపల కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు రంగారెడ్డి, మెదక్ ఆ మాటకొస్తే మిగిలిన తెలంగాణా జిల్లాల వ్యాప్తంగా చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచానికి తన ఉనికిని ఎలుగెత్తి చాటే రాజధాని డొల్లతనం ఒక మోస్తరు వర్షంతో బయటపడిపోయింది. వర్షాలకి కారణం ఎవరు అనేదాని మీద పూర్తి బాధ్యత గత పాలకుల మీదనే వేస్తున్నారు కెసిఆర్ ఆయన బృందం. ఆ మాటకొస్తే ఆయన అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచీ ప్రతీ రోజూ ఎదో ఒక సమస్య రావడం గత పాలకుల వైఖరి ఎత్తి చూపడం జరుగుతూ ఒస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో పాలన చేసిన రాజకీయ నాయకుల్నీ, పార్టీలనీ , అధికారుల్నీ ఎద్దేవా చెయ్యడానికి కెసిఆర్ ఈ ఈ సందర్భాల్ని ఉపయోగించుకోవడం హాస్యాస్పదం. అయితే తెలంగాణా భావి భవిష్యత్తు మాత్రం కెసిఆర్ చేతిలోనే ఉంది అనే విషయం ఆయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి.

హైదరాబాద్ లో కేటీఆర్ , నీటి ప్రాజెక్టుల విషయం లో హరీష్ రావు ఇద్దరూ తమ తమ పనులు సంతృప్తికరంగా చేసారు అని కెసిఆర్ భావిస్త్హున్నారా ? లేదంటే వారికి కూడా కెసిఆర్ క్లాసులు పీకిన సందర్భాలు ఉన్నాయా ? అరవై ఏళ్ళ కాలం లో కాంగ్రెస్ - తెలుగుదేశం కలిసి హైదరబాద్ ని నాశనం చేసాయి అనడం మామూలు అయిపొయింది. ఆ టైం లో పాలన చేసింది వాళ్ళే కాబట్టి పడాల్సిందే మరి, పడుతున్నారు కూడా. ఎదురు మాట్లాడ్డం కూడా లేదు ఆయా పార్టీలు. పాత ప్రభుత్వాలని , వారి తప్పులనీ ఎత్తి చూపే కెసిఆర్ ప్రభుత్వం తమ హయాం లో ఎలాంటి తప్పులూ చెయ్యలేదు అంటే అది నమ్మచ్చా ? ఒక ఉదాహరణ చూద్దాం .. 2015 నవంబర్ లో తెరాస ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీం ని అమలు చేసింది. లే అవుట్ ల క్రమబద్దీకరణ కోసం 68,772, భవనాల క్రమబద్దీకరణకు 1,31,095 దరఖాస్తులు వచ్చాయి.


మొత్తం నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ సమయం లో ప్రభుత్వం వసూలు చేసింది. ప్రస్తుతం వర్షాల దెబ్బకి ముంపుకు గురైన కూకట్పల్లి, నిజాం పేట, అమీర్ పేట వంటి చోట్ల నుంచి ఈ క్రమబద్దీకరణ జరిగింది. విచక్షణ తోనే ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తోంది అంటూ తమని తాము సపోర్ట్ చేసుకుంది కెసిఆర్ ప్రభుత్వం. ఒక పక్క పర్యావరణ సంస్థలు ఇది సరైన పద్దతి కాదు అనీ అధిక వర్షాలు పడితే ఆ ప్రాంతానికి చాలా డేంజర్ అనీ చెబుతూ ఉన్నా కూయా ఎన్నికల నేపధ్యం లో (GHMC) తలకి ఎక్కించుకోలేదు కెసిఆర్ ప్రభుత్వం. 2016 ఫిబ్రవరి లో విజయ భేరి మోగించిన తరవాత కొంత కాలం పాటు ఆగి ముంపు ప్రాంతాలలో బిల్డింగ్ లు పడగొడదాం అని ఫిక్స్ అయినా ఇప్పటి వరకూ అలాంటిది జరగలేదు.


మరొక పక్క నాలాల ఆక్రమణ విషయం లో ఫిర్యాదులు చేస్తే బహుమతికూడా ఇస్తాం అంటూ కెసిఆర్, GHMC ప్రకటించడం హాస్యాస్పదం అంటున్నారు విశ్లేషకులు. ఇన్ని లక్షలమంది దరఖాస్తు దారులు తాము అడ్డదిడ్డంగా కట్టుకున్న ఇళ్ళకి క్రమబద్దీకరణ చెయ్యాలి అని కోరుతున్న తరుణంలో తమ ప్రాంతం నాలాల ఆక్రమణ తరవాత నిర్మించబడింది అని ఎలా ఒప్పుకుంటారు ? అది జరిగే పనేనా ? పైగా భావన నిర్మాణ వ్యక్తులు తెరాస పార్టీతో కూడా సంబంధం ఉన్నవారే.నగరంలోనే ప్రథమ శ్రేణి నిర్మాణ సంస్థల అధినేతలతో వున్న అనుబంధాలూ అందరికీ తెలుసు. అప్పట్లో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రావడమే అయ్యప్ప సొసైటీ కూల్చివేత ప్రారంభించి ఆపేసింది ఆ టైం లో ప్రభుత్వంతో పోరాడి మరీ అరస్ట్ అయిన ఆరెకపూడి గాంధీ ఇప్పుడు తెరాస లో ఉన్నారు.

అలా ఉంటుంది కెసిఆర్ మాస్టర్ ప్లాన్. పైకి ఒకలాగా లోపల మరోకలాగా సాగుతుంది కథ. అంతెందుకు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద బోలెడు హడావిడి జరిగింది. ఇంకేముంది కూల్చేస్తున్నారు అదీ ఇదీ అంటూ వార్తలు వచ్చాయి కానీ దానిమీద చెయ్యి కూడా వెయ్యలేదు అధికారులు. ఇప్పుడు ఆ విషయం కూడా మర్చిపోయారు అందరూ. సో తాము క్రమబద్దీకరణ చెయ్యాల్సిన బిల్డింగ్ లని అంతలేసి ఆదాయం ఒదులుకుని మరీ కెసిఆర్ ప్రభుత్వం కూలగోడుతుంది అనుకోవడం కామెడీ విషయం. ఆయన చెప్పే కహానీలలో కెసిఆర్ మరొక కహానీని జోడించారు అనుకోవాలి అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: