ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అందుకు ప్రత్యేక హోదానే అసలైన మార్గమని అటు అధికార టీడీపీ ఇటు ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రత్యేక హోదా కల్పించడానికి సుముఖత చూపించినా ఆతర్వాత ఈ విషయాన్ని మెల్ల మెల్లగా వాయిదావేస్తూ వచ్చింది. కొంత కాలం గడిచిన తర్వాత ఈ విషయాన్ని అవకాశంగా తీసుకొన్న ప్రతిపక్ష నేత జగన్ ఏపీ కి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలని డిమాండ్ చేయడంతో అధికార టీడీపీ సైతం దీనికి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఇటీవల ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో వారికి నచ్చకపోయినా అధికార, పర్తిపక్షాలు కలిసి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేయడం మనకు విదితమే. 


Image result for jagan baabu

ఆంద్ర రాష్ట్రానికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై పెట్టే సమావేశాలకు వెళ్తే ఆయనలా జైలుకు వెళ్లడం నేర్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంకోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏర్పాటుచేసే సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల ఏలూరులో జరిగిన మీటింగ్‌లో ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

Image result for jagan baabu

‘ఇక్కడున్న వారికి కూడా పిల్లలు ఉండే అవకాశం ఉంది. వారిని బుద్ధిగా కళాశాలలకు వెళ్లి చదువుకుని రమ్మనండి. మీటింగ్‌లు, చాటింగ్‌లు అంటూ జగన్ పెట్టే సమావేశాలకు వెళ్తే వారికి జైలుకు వెళ్లడం ఎలాగో నేర్పిస్తారు. ప్రత్యేక హోదా అంటూ ఆయన పెట్టే సమావేశాలకు వెళ్తే వారు కూడా జైలుకు వెళ్తారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అని అందరూ గళమెత్తుతున్నారని, కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మాత్రం చెప్పలేక నీళ్లు నములుతున్నారని అన్నారు. తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.


Image result for jagan baabu

ప్రత్యేక హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటి? అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ‘‘ఎంతో చదువుకున్నామన్నారు.. ఇతర దేశాల్లో స్థిరపడ్డారు.. ప్రత్యేక హోదాపై వారికి కనీస అవగాహన కూడా లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు.. అసలు పరిశ్రమల రాయితీలకు, ప్రత్యేక హోదాకు ఏమైనా సంబంధం ఉందా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మాట్లాడుకోనివ్వండి’’ అంటూ ప్రవాసాంధ్రులపై సీఎం చిర్రుబుర్రులాడారు. తనపై ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: