భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పటి నుంచి ఎప్పుడూ సఖ్యతగా లేదు..ప్రపంచదేశాలతో భారత్ కొనసాగిస్తున్న స్నేహ సంబంధాలు ఒక్క పాకిస్థాన్ తప్ప అన్నీ అనుకూలాంగానే స్పందిస్తున్నాయి. ఇక భారత్ ను అప్పుడప్పుడు దొంగ దెబ్బతీయడం పాకిస్థాన్ కి అలవాటే..ఇప్పటికే ఎన్నోసార్లు యుద్దం చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ చేతకాక తొక ముడిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్ కి జరిగిన పరాభవంతో కొంత కాలం కామ్ గా ఉన్న పాక్ ఇప్పుడు ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వారిని భారత్ పై ఉసిగొల్పుతుంది.
Image result for pakistan india
ఈ సంవత్సరం జనవరి 1 న పంజాబ్ లోని పఠాన్ కోట్ పై దాడి చేసింది..రీసెంట్ గా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ సెక్టార్‌లో భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే.  ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో షాక్‌ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దాయాది పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్‌ ఫేవర్డ్‌ (అత్యంత సన్నిహిత) దేశం హోదాను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.
Image result for pakistan india
ఇప్పటికే పాక్‌కు జీవనాడీ అయిన సింధు నదీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. పాకిస్థాన్‌ను నాలుగు వైపుల నుంచి దెబ్బకొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆయన అంతర్జాతీయ వేదికగా పాక్‌ను ఏకాకిని చేసేలా వ్యూహరచనలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: