బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఏం డెలివరీ వస్తుంది? ఇదేం ప్రశ్న అనుకోకండి! చెప్పండి.. బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏం డెలీవరి వస్తుంది. బిర్యానీ కదా.. మరి పిజ్జా ఆర్డర్ చేస్తే.. మరీ చాదస్తం అనుకోకండి..! పిజ్జానే డెలివరీ వస్తుంది. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో పిజ్జా ఆర్డర్ చేస్తే.. నోట్ల కట్టలు వచ్చాయి. పిజ్జా తిందామని ఆవురావురుగా ప్యాక్ ఓపెన్ చేస్తే.. బయపడ్డ నోట్ల కట్టలు చూసి నోరు వెళ్లబెట్టిందా యువతి. ఆ పిజ్జా ఏంటో.. నోట్ల కట్టల సంగతేంటో చదవండి..


కాలిఫోర్నియాలో నివాసముండే సెలీనా.. చికెన్ పిజ్జా కోసం.. డొమినో పిజ్జాకు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసింది. కొద్ది సేపటి తరువాత డెలివరీ బాయ్ వచ్చి పిజ్జా డెలివరీ చేసి వెళ్లాడు. పిజ్జా తిందామని బాక్స్ ఓపెన్ చేసిన సెలీనా.. ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టింది. బాక్స్ లో పిజ్జాకు బదులు నోట్లకట్టలు చూసి షాకైంది. అందులో 5వేల డాలర్లు ఉన్నాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.3లక్షలకు పైనే. 


కామన్ గా ఎవరికైనా అంత డబ్బు ఉచితంగా లభిస్తే ఏం చేస్తారు? కొత్తగా చెప్పేదేముంది లెక్కేసుకుని.. బీరువాలో పెట్టేసుకుంటారు. కానీ.. సెలీనా అలా చేయలేదు. ఇంత డబ్బు పోగొట్టుకున్నవారు ఎంత బాధపడుతుంటారోనని ఆలోచించింది. వారు ఆ డబ్బు కోసం ఎంత కష్టపడి ఉంటారోనని అర్ధం చేసుకుంది. పరుల సొమ్ము పామని గ్రహించి.. ఆడబ్బును ఇచ్చి వేయాలని నిర్ణయించుకుంది. వెంటనే.. డొమినోస్ పిజ్జా సెంటర్ కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. డబ్బు వారిదేనని రుజువులు చూపడంతో.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. సెలీనా మంచితనానికి.. గుర్తుగా ఆమెకు పిజ్జా షాపుయజమాని ఓ బహుమతిని ప్రకటించాడు. ఏడాది పాటు సెలీనాకు డొమినోస్ పిజ్జాను ఉచితంగా అందిస్తామని ప్రకటించాడు.


అసలు పిజ్జాలోకి డబ్బెలా వచ్చిందో డొమినో పిజ్జా షాపు యజమాని తెలిపాడు. తాను బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని షాపుకు వచ్చానని, అదే సమయంలో సెలీనాకు డెలివరి ఇచ్చే పిజ్జా పార్సిల్ జరుగుతోందన్నాడు. పొరపాటున పిజ్జాకు బదులు డబ్బును అందులో పెట్టి డెలివరీ చేశామన్నాడు. పరుల సొమ్మును స్వీకరించకుండా.. పోగొట్టుకున్న వారి కష్టాన్ని అర్ధం చేసుకుని.. డబ్బును తిరిగి ఇచ్చిన సెలీనాను పొగడ్తలతో ముంచెత్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: