తెలుగు రాష్ట్రాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన నయీమోద్దీన్  (నయీమ్) గత నెల గ్రేహౌండ్స్ దళాల చేతిలో ఎన్ కౌంటర్ గావింపబడ్డాడు. అయితే నయీమ్ అందరూ అనుకుంటున్న గ్యాంగ్ స్టర్ మాత్రమే కాకుండా ఎంతో క్రూరత్వంతో కూడిన క్రిమినల్ అని దర్యాప్తులో తేలింది. అయితే అప్పట్లో నయీమ్ కేవలం భూ దందాలు, సెటిల్ మెంట్స్,కిడ్నాపులు మాత్రమే చేసేవాడని మామూలు గ్యాంగ్ స్టర్ అని మాత్రమే అనుకున్నారు. కానీ నయీమ్ చనిపోయిన తర్వాత అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయట పడ్డాయి.

Image result for nayeem photos
దాదాపు పదివేల కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అంతకు మించే ఉండవచ్చని సిట్ దర్యాప్తులో తేలింది.  ఇక ఒక సామాన్యమైన క్రిమినల్..మాజీ నక్సలైట్ ఒక్కసారే ఇన్ని కోట్లు ఎలా కూడబెట్టాడు..అతని వెనుక ఉన్న బలం ఏంటీ అనేదానిపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే నయీమ్ వెనుక పోలీస్ అధికారలు, రాజకీయ నాయకులు, కొంతరు బడా బిజినెస్ మ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా యీం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో నయీంతో లింకులున్న వారికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.దీంతో అధికారు టీఆర్ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతల లెసైన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి, కొందరి రాజకీయా నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Image result for nayeem photos
ఇక అందరూ ఊహించిన విధంగానే సిట్ దర్యాప్తులో 21 మంది పోలీసు అధికారులకు నయీంతో భూ లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు లభించాయి. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు తెలిసింది. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది.  నయీంతో కలిసి భారీగా భూ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు లభించడంతో పాటు వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది.
Image result for nayeem photos
రాబోయే కాలంలో వీరందరిపై క్రమశిక్షణ చర్యల కింద పోలీసు శాఖ నుంచి తప్పించనున్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని సీఎం కేసీఆర్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులు లాయర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండతో గ్యాంగ్‌స్టర్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: