ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసిన యువకుడు బండారం బయటపడిందని తెలిసి బాలిక కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుందీ ఘటన. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయిగా పరిచయం చేసుకొని దగ్గరై నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 


Image result for nife attach shadow

నగరానికి చెందిన అమిత్ యాదవ్(24) ఫేస్‌బుక్‌లో అధర్వ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల ప్రియా రావత్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తరచూ చాటింగ్ చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత అధర్వ అమ్మాయి కాదని, అమిత్ యాదవ్ అనే యువకుడని తెలుసుకున్న ప్రియ అతడితో చాటింగ్ చేయడం మానేసింది.


Image result for nife attach shadow

 దీంతో ఆ యువకుడు ఆమెను కలిసేందుకు వస్తానంటే నిరాకరించింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు తనతో మాట్లాడాలని బ్రతిమిలాడాడు. అయితే, తనకు అబద్ధం చెప్పి మోసం చేశావని, మాట్లాడటం, చాట్ చేయడం కుదరదని తెగేసి చెప్పింది.  అమ్మాయివనుకుని చాటింగ్ చేశానని, అబ్బాయి అని తెలిసి మానేశానని ప్రియా చెప్పింది. అసలు నువ్వు ఎవరో తనకు తెలియదని చెప్పింది. దీంతో అప్పటికే కోపంతో రగిలిపోతున్న అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియపై దాడిచేశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపైనా దాడికి తెగబడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తి పోట్లు పొడిచాడు. ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయే క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: