ఒక్కసారి నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోవడం కుదిరే పనికాదని తెలుసు. సామాన్యుల మాట ఎలా ఉన్నా..?ఒక హోదాలో ఉన్న వారు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడిల్సిందే. లేదంటే పెద్ద రాద్ధాంతం అవుతుంది. అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. కానీ తెలంగాణ సీఎం చెప్పిన మాట ఇప్పుడు ఆయనకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది.


ఉద్యమం సమయంలో కేసీఆర్‌ ఏది మాట్లాడినా వివాదస్పందగా ఉండేది. ఆయన ఎప్పుడు ఎవరిపై ఏ తూటా పేల్చుతారో తెలియక పోయేది. కానీ రాష్ట్రం సిద్ధించి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆచీతూచి మాట్లాడుతున్నారు. ఒక్కోసారి కేసీఆర్‌ ఇలా కూడా మాట్లాడుతారా..! అన్న ఆశ్చర్యం కలగక మానదు. అంతలా తన మాటల ప్రవాహాన్ని కట్టడి చేసుకున్నారు. ఒకటి రెండు సార్లు ప్రతిపక్షాలను విమర్శించినా ఆచీతూచి మాట్లాడుతున్నారు.


స్వతాహాగనే అన్ని విషయాలపై మంచి అవగాహన కలిగిన కేసీఆర్‌ ఏ విషయం మీదనైనా సరే అలవోకగా..అనర్గళంగా మాట్లాడేస్తారు. లెక్కలతో సహా.. సమయంతో సహా చెప్పడం ఆయన పరిజ్ఞానానికి నిదర్శనం. అయితే ఒక్క విషయం మాత్రం ఆయనను ఇరుకున పెడుతోంది. హైదరాబాద్ మహానగరం రోడ్ల మీద ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పక్షాలే కాదు.. ప్రజలు కూడా కేసీఆర్ మాటలపై ప్రజలు కూడా వస్తృతంగా చర్చించుకుంటున్నారు.


ఇంతకు విషయం ఏంటంటే వర్షాల కారణంగా హైదరాబాద్ మొత్తంలో దెబ్బ తిన్న రోడ్లు 10 శాతం మాత్రమేనని కేసీఆర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే నగర రోడ్లపై అనునిత్యం అపసోపాలు పడుతున్న ప్రజలకు సీఎం కామెంట్‌ రుచించలేదు. ఓవైపు 90 శాతం రోడ్లు ధ్వంసం అయి 10 శాతం మాత్రమే బాగుంటే కేసీఆర్‌ రివర్స్‌లో మాట్లాడడం పట్ల అందరూ గుర్రుగా ఉన్నారు. 


అయితే కేసీఆర్‌కు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడంలో అధికారులు చేసిన పొరబాటువల్లే ఇలా జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.  చాలా అరుదుగా మాత్రమే ఇలా దొరికిపోయే కేసీఆర్ ను విపక్షాలు వదిలిపెట్టటం లేదు. రోడ్లపరిస్థితి సీఎంకు కళ్లకు కనబడడం లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: