తెలంగాణను మరిచిన వెంకయ్య పై ఎంపీ కవిత ఫైర్:

 MP Kavitha satire on Venkaiah Naidu

తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రమంత్రి, బిజెపి వెంకయ్య నాయుడు పైన బుధవారం నాడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.  వర్షాల వల్ల నీట మునిగిన ప్రాంతాలను వెంకయ్య ఏరియల్ సర్వే ద్వారా ఏపీలో పరిశీలించారు. దీనిపై ఆమె స్పందించారు. ఏపీలో విహంగ వీక్షణం చేసిన వెంకయ్య తెలంగాణను మాత్రం మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. 
 
హోదాను అభ్యంతరకరంగా మార్చే ప్రయత్నం : కేవీపీ

KVP and Rahuveera Reddy in Praja Ballot

త్యేక హోదా అనే పదాన్ని కొందరు అభ్యంతరకర పదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు బుధవారం అన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పై ప్రజా బ్యాలెట్ నిర్వహించింది.  ప్రత్యేక హోదా అవసరమా? వద్దా? ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేస్తున్నారా? విస్మరిస్తున్నారా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది.  మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట (మునికోటి ప్రాంగణం)లో జరిగే ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రామచంద్రారావుతోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. 


మెడికల్ కౌన్సెలింగ్ గడుపువ పెంచారు :

మెడికల్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిలింగ్ విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియను సెప్టెంబరు 30వ తేదీకల్లా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులను ఒక నెల పాటు పొడిగించాలని కోరుతూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరుగనుంది. ఎంసెట్ -2 ప్రశ్నాపత్రం లీక్ కావడంతో మూడోసారి ప్రవేశపరీక్ష నిర్వహించాల్సి వచ్చిందని, అందువల్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేయడానికి గడువు అవసరమైందని తెలంగాణ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. 


మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ ఎటాక్ :

మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి చెందిన ఆస్తులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు.  ఈ దాడిలో  కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బెంగళూరులోని ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: