కశ్మీర్‌కు స్వాంతంత్ర్యం వచ్చిన మరుక్షణం భారత్ ముక్కలవడం ఖాయమని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ అన్నారు. కశ్మీరీలు సాగిస్తున్న స్వతంత్ర పోరాటం విజయం సాధిస్తే కనుక అది భారత్ ముక్కలు కావడానికి నాంది అవుతుందని అన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేస్తుంటే భారత్ వైపు నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని ఆరోపించారు. మరోవైపు కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ వాదనకే తాము మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ ఝెన్‌మిన్ తెలిపారు. కశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందని, కాబట్టి ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా కోరుకుంటోందని ఆయన అన్నారు.


Image result for india pakistan

భారత్‌కు టెర్రరిజాన్ని ఎగమతి చేస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా పాకిస్థాన్‌కు భారత్‌ 1996లో కల్పించిన వాణిజ్యానికి ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (అత్యంత సానుకూలమైన దేశం–ఎంఎస్‌ఎన్‌)’ హోదాను గురువారం సమీక్షిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.


Image result for india pakistan

ఈ హోదాను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్నట్టయితే అది కేవలం ప్రతీకాత్మక నిరసన అవుతుంది తప్ప పాకిస్థాన్‌కు ఈషన్మాత్రం నష్టం వాటిల్లదు. పైగా భారత్‌ నుంచే ఎక్కువ టారిఫ్‌కు సరకులు ఎగుమతి చేస్తూ, ఇతర దేశాలకన్నా కాస్త తక్కువ టారిఫ్‌కు సరకులను దిగుమతి చేసుకుంటున్నందున అంతో ఇంతో నష్టం భారత్‌కే కలుగుతుందని ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య లావాదేవీలు తెలియజేస్తున్నాయి.


Image result for india pakistan

సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: