తెలంగాణ ఆరాధ్య దైవం..తిరుపతి తర్వాత అంతటి గొప్ప  పుణ్యక్షేత్రం యాదాద్రి.  తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి పుణ్యక్షేత్రానికి మహర్ధష వచ్చింది.  వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుత శిల్ప కళా రూపాలతో దైవభక్తి ఉట్టిపడే తీరులో తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేవస్థానం అధికారులను ఆదేశించారు.  తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దతో కొలిచే దేవుడు నృసింహ స్వామి.

యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ఆయన బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తుల కోసం నిర్మించనున్న నిర్మాణాల త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయకట్టడాల త్రీడీ నమూనాల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

యాదాద్రి భక్తుల బస కోసం నిర్మించ తలపెట్టిన కాటేజీలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సీఎం ఆమోదించారు. వచ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. 

కాటేజీలలో మార్పులు :


యాదాద్రి నరసింహాలయంపై సమీక్షనిర్వహించిన సీఎం..కాటేజీలలో చిన్నచిన్న మార్పులతో డిజైన్‌ ను సీఎం ఆమోదించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రి దేవస్థానం రూపొందించాలన్నారు సీఎం.

బ్లాక్‌స్టోన్‌తో నిర్మాణం:


ప్రపంచంలోనే మొదటి దేవస్థానంగా యాదాద్రి చరిత్రలో నిలిచిపోనుందని ఆకాంక్షించారు సీఎం. యాదాద్రి ఆలయ సముదాయం పూర్తిస్థాయి బ్లాక్‌స్టోన్‌తో నిర్మితమవుతోంది. 500 మంది శిల్పులు యాదాద్రిలో ఇప్పటికే శిల్పాలు చెక్కడం, నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. 


తంజావూర్ వంటి సాంప్రదాయ ఉట్టిపడేలా నిర్మాణం:


ఆగమశాస్త్ర సూత్రాలను తంజావూర్ వంటి వేల ఏళ్ల కిందటి సాంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణప్రతిష్ట పోయనున్నదని తెలిపారు.యాదాద్రిలో పూర్తిస్థాయి నిర్మాణాల అనంతరం గుట్టపై పచ్చదనం వెల్లువిరియడంతోపాటు ఆలయ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సీఎం కేసీఆర్‌కు భావిస్తున్నారు.

108 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహం:


యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయ స్వామి భారీ విగ్రహ నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. ఆంజనేయ స్వామి భారీ విగ్రహ రూపకల్పనకు చైనా శిల్పులు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్ట్ ఆనందసాయి, దేవాలయ కమిటీ సభ్యులు చైనాలో పర్యటించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: