ఉదయం లేచిన దగ్గర నుంచీ సంచలన వ్యాఖ్యలతో జనాలని నిద్రలేపడం టీవీ 9 ఛానల్ కి చాలా మామూలు విషయం. త్వరలో ఈ ఛానల్ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్న పరిస్థితుల్లో టీవీ9 అమ్మకానికి సిద్దం అయ్యారు అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఈ చర్చ ఇవాళ కొత్తగా మొదలైంది ఏమీ కాదు దాదాపు ఎన్నో ఏళ్ళుగా చర్చ సాగుతోంది. కానీ ఈ మధ్యన మాత్రం జీ గ్రూప్ tv 9 మీద కన్నేసింది అనీ ఈ ఛానల్ ని త్వరలో తమ జీ గ్రూప్ లో కలిపెసుకునే ఆలోచన చేస్తోంది అనీ వివిధ వార్తలు బయటకి పోక్కుతున్నాయ్. ఈ ఛానల్ కి వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఉన్న చింతలపాటి శ్రీనివాస రాజు అరవై శాతం వాటాదారుడు, ఆయనతో పాటు ఉండే రవిప్రకాష్ కి ఇరవై శాతం వరకూ వాటా ఉంది.

రాష్ట్ర విభజన, రాజకీయ అస్తిరత్వం, కొన్నాళ్ళు తెలంగాణా ప్రభుత్వం టీవీ 9 ని బ్యాన్ చెయ్యడం ఇలాంటి పరిస్థితి లో అనుకున్న మేరకు కాకుండా ఛానల్ పురోగతి వెనక్కి మళ్ళిన మాట వాస్తవం. 2009 లో అమెరికాకి చెందిన కొందరు ఈ ఛానల్ లో ఇరవై శాతం మేరకు వాటా తీసుకున్నట్టు చెబుతారు. మొన్నటికి మొన్న టీవీ 9 ని అన్నిరకాలుగా జీ గ్రూప్ కి అమ్మేసారు అంటూ నమ్మకమైన వార్తలు వచ్చాయి. ఒక ప్రధాన పార్టీ ప్రతినిధి మధ్యలో ఉండి ఈ తతంగం మొత్తం నడిపించాడు అని అన్నారు.ఒకటి రెండు మాసాల కిందట సుభాష్‌ చంద్ర యాజమాన్యంలోని జీ గ్రూపుతో ఎబిసిఎల్‌కు ఒక ఒప్పందం కుదిరిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ వార్త ఇచ్చింది. ఒక ప్రముఖ తెలుగు పత్రిక కూడా ఈ విషయాన్ని ధృవీకరణ చేస్తూ ఒప్పందాలు కుదిరాయి అని తన వాణిజ్య పేజీలో వార్త రాసేసింది.

జీగ్రూప్ ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. తాము ఎంతగా ప్రయత్నాలు చేసినా జీ గ్రూప్ ప్రతినిధులు ఈ విషయంలో ఎస్ ఆర్ నో అనేది కూడా చెప్పడం లేదు అంటూ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అయితే టీవీ 9 రవిప్రకాష్ మాత్రం ఈ పత్రికతో మాట్లాడారు , వెంచర్ కాపిటలిస్ట్ లు ఏడు సంవత్సరాల కాలం తరవాత సాధారణంగా తప్పుకుంటారు అనీ కానీ తమ విషయం లో మాత్రం 12 సంవత్సరాలుగా వారే కొనసాగుతున్నారు అని రవిప్రకాష్ చెప్పుకోచ్చారట. జీ గ్రూపు కొనుగోలు విషయంలో ఏదీ ముగియలేదని చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని అనేది ఆయన నుంచి వచ్చిన ఆన్సర్. 2003 లో మొదలైన టీవీ 9 ఇతర భాషల్లో కూడా ఏడు చానల్స్ వరకూ నడుపుతోంది. మోడీ రాష్ట్రం గుజరాత్ నుంచి పక్కరాష్ట్రం కర్నాటక వరకూ నడుపుతున్నారు.

గుజరాత్ , కన్నడ ఈ రెండు చోట్లా ఈ ఛానల్ కి మన రేంజ్ లో పాపులారిటీ ఒచ్చింది. ఇదివరకే ఈటీవీ గ్రూపు ఛానల్ చేతులు మారిన తరుణం లో టీవీ 9 కూడా కాస్త అటూ ఇటూగా మారబోతోంది. రాజకీయ కథనాల్లో ఈ మార్పు గొప్ప తీర్పుని చెప్పబోతోంది అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం మీద కన్నేసిన బీజేపీ ఈ ఎత్తుగడని వేసినట్టు అనుకోవచ్చు. జీ గ్రూప్ కి అన్ని భాషల్లో కలిపి మొత్తం 35 చానల్స్ ఉన్నాయి. తెలుగులో కూడా వార్తా ఛానల్ ఒకటి ఉండేది కానీ దాన్ని మూసేశారు వారు. ఇప్పుడు టీవీ9 తీసుకుంటే వారు ఏ విధంగా నడుపుతారన్నది కూడా ఆసక్తికరం. సమాచార ప్రసార మంత్రిగా వెంకయ్య ఉండడం రిలయన్స్ వారు కమ్యునికేషన్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం ఈ పరిణామాలకి దారి తీస్తోంది అనేది విశ్లేషకుల భావన .     


మరింత సమాచారం తెలుసుకోండి: