కళ - దీనికి అడ్డుకట్టలు, కంచె లూ వెయ్యడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. మనిషిలో ఉన్న టాలెంట్ ని తోక్కెయ్యడం అంటే అది స్వతంత్ర భావానికి భంగం కలిగించినట్టే. దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ కి ఇలా కళ ని తోక్కెయ్యడం కొత్త విషయం ఏమీ కాదు. మూర్ఖపు ముసుగుల్లో ఎన్నో విషయాలని నిరాక్షణ్యం గా తొక్కేసే ఆ పాలకులకీ , ఆ దేశానికీ ఇప్పుడు బాలీవుడ్ మీద కన్ను పడింది. కాయిన్ కి మరొక పక్క చూస్తే బాలీవుడ్ యాక్టర్ ల తీరు కూడా విస్మయ పరుస్తోంది. బార్డర్ లో సైనికులు చనిపోతే కనీసం స్పందన కూడా లేని బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు పవిత్ర వాక్యాలు చదువుతున్నారు. మేము కళా కారులం మాత్రమే కాదు ప్రపంచానికి శాంతి ప్రవచన చేస్తుంటాం అంటూ ఇప్పుడు బాలీవుడ్ జనాలు కహానీలు చెబుతున్నారు.

పాకిస్తాన్ యాక్టర్ల విషయంలో అమలు అవుతున్న బ్యాన్ కి స్పందిస్తున్న బాలీవుడ్ వారికీ అండగా నిలుస్తోంది. తప్పు లేదు సాటి కళాకారుల మీద ఆ మాత్రం మక్కువ, సపోర్ట్ ఉండాలి కానీ ఇదే ఫీలింగ్ వారికి బోర్డర్ లో శత్రువుల చేతిలో దారుణంగా సైనికులు చంపబడిన రోజున ఏమైంది ? ఆ టైం లో తీరికలేని వారు కూడా ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం తమ దేశ కళాకారులు అందరినీ పాకిస్తాన్ వచ్చెయ్యమని ఆజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలో బాలీవుడ్ వారికి ఫుల్ సపోర్ట్ చేస్తోంది . తాజాగా ఎం ఎస్ ధోనీ సినిమాని ఆ దేశం బ్యాన్ చెయ్యడం తో ఈ స్వరం కాస్త పెరిగింది కూడా. ఉద్రిక్త పరిస్థితి లో భారత్ నుంచి ఒచ్చే సినిమా మాకు ఒద్దు అంటూ వారు కొత్త స్టోరీ వినిపిస్తున్నారు. ఈ నిషేధం కూడా అప్రకటితంగా జరుగుతోంది అంటే ఈ సినిమాను అక్కడ విడుదల చేయకూడదని పాకిస్తానీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారట. ఉద్రిక్త పరిస్థితిని వంకగా చూపిస్తూ ఈ మాటలు చెబుతున్నారు వారు.

సో పాకిస్తాన్ కి , అక్కడి కళాకారుల కీ సపోర్ట్ చేసిన బాలీవుడ్ ని చెప్పుతో కొట్టినట్టు లేదు ఈ పరిణామం ? పాకిస్తానీ నటుల తరఫున వకాల్తా పుచ్చుకున్నవారికి ఇది ఖచ్చితంగా చెప్పు దెబ్బే. మనవాళ్ళు కళకీ, కళాకారుల కీ మధ్యన దేశాన్నీ - మతాన్నీ అడ్డంగా తీసుకుని రాకండీ అంటుంటే వారు ' ఉద్రిక్తత ' మాటున ఏకంగా సినిమాలనే బ్యాన్ చేస్తున్నారు. ధోనీ సినిమా పాకిస్తాన్ లో విడుదల అవ్వకపోతే విపరీతమైన లాస్ లు ఒచ్చేసెంత ఆర్ధిక వనరు ఏమీ కాదు కానీ భారత్ విషయం లో పాకిస్తాన్ ఎలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటుందో ఈ వ్యవహారం రుజువు చేశ్తోంది. కరణ్ జొహార్, సైఫ్ అలీఖాన్, సల్మాన్ లాంటి వాళ్లు .. పాకిస్తానీ నటుల తరఫున పోరాడుతూనే ఉన్నారు. మరి సడన్ గా ధోనీ సినిమాని నిషేధించి వారి సపోర్ట్ ని కూడా పాక్ కోల్పోవాలి అనుకుంటూ ఉందా?

ఇన్నాళ్ళూ పాక్ కళాకారుల మీద ప్రేమ కార్చేసిన మనవాళ్ళు ఇప్పుడు అక్కడ ధోనీ సినిమా నిషేధం పట్ల స్పందించే సీన్ ఉందా ? శాంతి , కళ లాంటి కబుర్లు చెప్పి మళ్ళీ సినిమా ని ఒక స్థితి కి తీసుకుని ఒచ్చి , నిషేధం ఎత్తించ గలరా ? పోనీ ఎవరికైతే(పాకిస్తాన్ కళాకారులు) మనవాళ్ళు సపోర్ట్ చేసారో  వారైనా ఈ సినిమా నిషేధం పట్ల ఒక వ్యాఖ్య చెయ్యగలరా ? కళని కళ గానే చూద్దాం తప్ప దేశాల మధ్యన గొడవగా కాదు అంటూ మనవాళ్ళు మాట్లాడినట్టు వారు ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలరా ? అలా జరుగుతుంది అనుకుంటే అదొక జోక్ అని చెప్పాలి. ఎందుకంటే సిరియా, ఇరాక్ లలో ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే చలించిపోయే ఇండియా లోని పాకిస్తానీ యాక్టర్ లూ, టెక్నీషియన్ లూ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగే మారణహోమం గురించి ఒక్క మాటకూడా మాట్లాడారు.

వారి దాకా ఎందుకు మన ప్రభుద్దుల కే ఆ విషయంలో సమర్ధత ఉండదు, ఒక రెస్పాన్స్ ఉండదు.  సిరియాలో బాధితుల పట్ల ట్వీట్ల ద్వారా మీరు వ్యక్త పరిచే జాలిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయం లో ఎందుకు కనబరచరు? అనేది ప్రతీ భారతీయుడు ప్రశ్న. మనసు లేని కళాకారులని పోసిస్తున్నాం మనం .. వారు నిజంగా కళాకారులా ? అవకాశ వాదులా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: