పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. పాక్‌ సరిహద్దులోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించాలని పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ కు ఆయ‌న‌ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Image result for bharat border

కశ్మీర్ లోని ఎయిర్ పోర్టులు, వైమానిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలను మొహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు అఖిల‌ప‌క్షంతో ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న తీవ్ర పరిణామాలపై ప్రధాని మోదీ అన్ని దేశంలోని ప్రముఖ పార్టీల నేతలతో కీలక చర్చలు జరపనున్నారు. 



Image result for bharat border
పాక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ యుద్ధానికి స‌న్న‌ద్ధమయినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పాకిస్థాన్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ పాక్ భద్రత, రక్షణకు సిద్ధంగా ఉన్నామని భారత్ నిన్న చేసిన దాడిని ఖండిస్తున్నామ‌ని మ‌రోసారి భార‌త్‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అఖిలపక్ష భేటీకి రావాలని సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్‌ సహా విపక్ష నాయకులందరికీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాచారం ఇచ్చారు. భారత సైనిక చర్యపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: