తెలంగాణ ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభమవుతున్నది. తొమ్మిదిరోజుల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా సంబురాలు జరుగనున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ఈ పూల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఉత్సాహపూరిత పండుగను వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. తెలంగాణ బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి వెల్లడించేలా అక్టోబర్ 8న సుమారు 20వేల మంది మహిళలతో మహాబతుకమ్మ పేరుతో విశిష్ట ఉత్సవాన్ని నిర్వహించనున్నది.


Image result for bathukamma images

శ్రీ లక్ష్మి నీ మహిమలు... అంటూ పాడుతూ ఆడే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభంకానుంది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై వచ్చే నెల 9న సద్దుల బతుకమ్మ వరకు ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం బతుకమ్మను అధికారిక ఉత్సవంగా ప్రకటించింది. గత రెండేళ్ల మాదిరే బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం రోజున చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజున సెలవు దినాలుగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈసారి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పూల పండుగను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.


Image result for bathukamma images

ఇటీవల వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు నిండడంతో గత రెండేళ్లకంటే మించిన రీతిలో పండుగ నిర్వహించేందుకు రూ.15కోట్లు విడుదల చేసింది. పది పాత జిల్లాలకు రూ.పదేసి లక్షలు, కొత్తగా ఆవిర్భవించనున్న 17 జిల్లాలకు రూ.ఐదేసి లక్షలు కేటాయించింది. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది చెరువుల్లో భారీగా నీరు చేరినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. చెరువుల్లో భారీగా నీరు చేరినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Image result for bathukamma images

తెలంగాణ జాగృతి, టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వంటి సంఘాలన్నీ ఈ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్రహ్మకుమారీల సారథ్యంలో జరిగే బతుకమ్మ ఉత్సవాలు ఈ సారి ప్రత్యేకాకర్షణగా ఉంటాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత సారథ్యంలో తొమ్మిది దేశాలలో బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి. అక్టోబర్ 3న టీఎన్జీవో సారథ్యంలో రవీంద్రభారతిలో వేడుకలు ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: