ప్రస్తుతం దేశం లో 'సర్జికల్ స్ట్రైక్' ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉరి ఘటన కి బదులుగా భారత్ గట్టిగా రివెంజ్ తీర్చుకుంది అని భారతదేశం మొత్తం హర్ష ధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైనిక చర్య ని భారత్ ఎప్పుడూ నిర్వహించలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటి ముందుకు వెళ్లి పాకిస్తాన్ సైన్యం తో పాటు టెర్రరిస్ట్ ల మీద మెరుపుదాడి చెయ్యడం అంటే అది సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ విషయం అనే చెప్పాలి. ఆర్మీ చర్య కి దేశవ్యాప్తం గా సపోర్ట్ లభిస్తూ ఉండగా ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేకపోవడం తో అసలు ఈ దాడుల వెనక నిజం ఎంత అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇవాళ భారత పత్రికలు మొత్తం ఎవరికి ఇష్టమైన నెంబర్ వారు వేసుకున్నారు.

భారత ఆర్మీ ఇంకా సరైన లెక్క చెప్పనే లేదు. మొత్తం 38 మంది తీవ్రవాదులని భారత కమాండో లు మట్టుబెట్టారు అనేది అధికారిక ప్రకటనలో ఒక పాయింట్. వారిని చంపే క్రమం లో పాకిస్తాన్ సైనికులని కూడా కొందరిని భారత్ చంపాల్సి వచ్చిందట. ఈ నెంబర్ లో ఒక కరెక్ట్ ఫిగర్ రావడం లేదు. సైన్యం నుంచి కొన్ని నెంబర్ లు వస్తుండగా 38 తీవ్రవాదులని మట్టుబెట్టాం అనే మాటని ధృడంగా ప్రపంచం మొత్తం మీద 25 దేశాలకి చెందిన దౌత్య అధికారులకి సమాచారాన్ని చేరవేసింది భారత్ ప్రభుత్వం. ఇందులో కామెడీ ఏంటంటే పాకిస్థాన్ అసలు తమమీద సర్జికల్ స్ట్రిక్ లే జరగలేదు అని బుకాయించడం. స్వయంగా వారి దేశపు ఆర్మీ ఈ విషయమై సంచలన ప్రకటన చేసింది. " మా మీద ఎలాంటి మెరుపు దాడులూ జరగలేదు, మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం . భారత్ నుంచి మాకు ముప్పు ఉన్న మాట నిజమే కానీ ఇప్పటి వరకూ వారు ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేదు " అంటూ ఆర్మీ నిన్న నీళ్ళు నమిలింది.

కథలో ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ మీడియా తో పాటు పాక్ ప్రధాని కూడా సర్జికల్ స్ట్రైక్ ల విషయం లో కాదు కాదు అన్నా కాసేపటికి అవును నిజమే అని ఒప్పేసుకున్నారు. ప్రభుత్వం ఒకలాగా , ఆర్మీ ఒకలాగా స్పందించడం ఆ దేశంలో కొత్తేమీ కాదు కానీ స్వయంగా ఇండియా విషయంలో పరస్పర బేధాలు రావడం షాకింగ్ గా ఉంది. ఈ రెండు వేర్వేరు ప్రకటనలతో పాకిస్తాన్ లోని సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళనకి గురయ్యారు. సైన్యం దాడులు జరగలేదు అంటుంటే ప్రధాని సైతం దాడి జరిగింది అని ఒప్పుకోవడంతో , తమ భవిష్యత్తు ఎంతవరకూ సేఫ్ గా ఉంది అనేది వారు భయపడుతున్న అంశం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది, అదంతా భారత భూభాగమే పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతం అంతే. సో ఆ ప్రాంతంలో జరిగిన దాడి కాబట్టి పైగా చనిపోయింది తీవ్రవాదులు కాబట్టి దాడి జరిగిన విషయం ఒప్పేసుకుంటే పాకిస్తాన్ సైన్యానికి తలతీసేసినట్టు ఉంటుంది వారి సైన్యానికీ, తీవ్రవాదులకీ వున్న లింకులు బయటపడ్తాయి.

అందుకే, పాక్‌ ఆర్మీ తూచ్‌ అనేసింది సర్జికల్‌ స్ట్రైక్స్‌ని. కానీ, పాకిస్తాన్‌ ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలి గనుక, భారత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి వీలుగా దాడి జరిగిందని పాక్‌ ప్రధాని ఒప్పేసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా పాకిస్తాన్ మీడియా లో సర్జికల్ స్ట్రైక్ కారణంగా జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి. అదే టైం లో పాకిస్తాన్ సైన్యం ట్రక్కుల్లో తీవ్రవాదుల మృతదేహాలు కూడా తరలిస్తున్న వీడియో లు పాకిస్తాన్ మీడియాలో కనపడ్డాయి. భారత్ సరైన ప్రూఫ్, కనేసం నెంబర్ లతో ఇవాళ ఒక గట్టి ప్రకటన చేస్తే పాక్ సైన్యానికి షాక్ ఇచ్చినట్టు అవుతుంది. కొసమెరపు ఏంటంటే మొన్న మొన్నటి వరకూ తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనీ తమని రెచ్చ గోడితే ఊరుకునే ప్రసక్తే లేదు అనీ, తమ ఊహల్లో కూడా ఊహించని మేర భారత్ కి హాని చేస్తాం అనీ ప్రకటించిన పాకిస్తాన్.

సర్జికల్ స్ట్రైక్ లు జరిగిన దాదాపు 36 గంటల తరవాత కూడా కిక్కురుమనడం లేదు. పూర్తిగా వారి నోట మాట పడిపోయింది. దానికి కారణం తమ మీద దాడి జరిగింది అని ఒప్పుకోవాలా , ఒప్పుకుంటే పరువు పోతుందా - రివెంజ్ కి తాము సిద్దమా కాదా అనే విషయం లో ఆదేశానికి క్లారిటీ లేకపోవడమే ఈ పరిస్థితికి మూలం.


మరింత సమాచారం తెలుసుకోండి: