చాలా రోజుల తరువాత భార‌త ఆర్మీ తమ ప్ర‌తాపం చూపించారు. యూరీ ఉగ్ర‌వాదుల దాడికి ప్ర‌తికారం తీసుకుంటామనే నాడే ప్ర‌క‌టించిన భార‌త ఆర్మీ... ఆ దిశ‌గా సక్సెస్ ఫుల్ ఆప‌రేష‌న్ ను పూర్తి చేసింది. ఆప‌రేష‌న్ పీఓకే పేరుతో త‌న దైన శైలీలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ప్ర‌యోగం తో పీఓకే లో త‌ల‌దాచుకున్న 38 మంది ఉగ్ర‌వాదుల తో పాటు మ‌రో ఇద్ద‌రు పాక్ సైనికుల‌ను మ‌ట్టుబెట్టారు. ఐదు ఉగ్ర‌వాద క్యాంపుల‌ను నెల‌మ‌ట్టం చేశాయి. ఈ ఆప‌రేషన్ కేవ‌లం నాలుగు గంట‌ల వ్య‌వధిలోనే పూర్తి చేసుకున్నాయి భార‌త ఆర్మీ. బుధ‌వారం అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల స‌మ‌యంలో ఆర్మీకి చెందిన ధ్రువ హెలికాప్ట‌ర్ల‌లో 4,9 రెజిమెంట్ల‌కు చెందిన 25 మంది పారామిల‌ట‌రీ క‌మాండోలు నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్ లోకి ప్ర‌వేశించారు.

ఆప‌రేషన్ పీఓకే ఎలా జ‌రిగిందంటే....

అత్యాధునిక సాంకేతికత క‌లిగిన హెలికాప్ట‌ర్ లో 25 మంది పారామిల‌ట‌రీ క‌మాండోలు నియంత్రణ రేఖ‌ను దాటి పాకిస్థాన్ లోకి ప్ర‌వేశించారు. మందుగా అనుకున్న ప్రాంతాల్లో హెలికాప్ట‌ర్ల కమాండోల‌ను  వ‌దిలేశాయి. ఉగ్ర‌వాదుల క్యాంపుల‌ను చేరుకోవ‌డానికి పీఓకే లోప‌లికి మూడు కిలోమీట‌ర్ల పాటు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ పేరుగా పిల‌వ‌బడే ఈ వ్యూహాం ల‌క్ష్యం.... నిర్దేశిత ల‌క్ష్యాల‌పై చాలా చురుకుగా దాడి చేసి శ‌త్రువును మ‌ట్టుబెట్ట‌డం, భారీగా న‌ష్టం క‌లిగించ‌డం, అయితే సామాన్య ప్ర‌జ‌ల‌కు, దాడి జరిగిన ప్రాంతాల్లో చుట్టుప‌క్క‌ల పెద్ద‌గా న‌ష్టం జ‌ర‌గ‌కుండా... కేవ‌లం ల‌క్ష్యాన్ని, అక్క‌డున్న శ‌త్రువుల‌ను మ‌ట్టు పెట్టడం ఈ దాడుల్లో చాలా కీలకం. చాలా సంద‌ర్భాల్లో యుద్దాన్ని నివారంచేందుకు కూడా ఇటువంటి దాడుల‌ను చేస్తుంటారు.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ను ఎందుకు చేశారంటే...

వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తరచూ చొరబాట్లు చేస్తున్న నేపథ్యంలో సర్జికల్ దాడుల ద్వారా పీవోకేలో ఉగ్రవాద కేంద్రాలను ఏరివేసేందుకు భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే బృందాలు ప్రత్యర్థి కళ్లుమూసి తెరిచేలోగానే మొత్తం పనిచక్కబెట్టుకుని వచ్చేస్తాయి. అప్పుడే ఆపరేషన్ విజయవంతం అయినట్లు. ఆర్మీ కమాండోలు  అత్యాధునిక ఆయుధాలైన టావర్, ఎమ్-4 తుపాకులతో పాటు గ్రేనేడ్లు, పొగ గ్రేనేడ్లు, బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్లు, చీకటిలో చూడగలిగే సాంకేతిక వస్తువులను కమాండోలు తమ వెంట తీసుకుని వెళ్లారు. కమాండోలు తలలకు పెట్టుకున్న హెల్మట్లలో కెమెరాలను అమర్చారు. క్యాంపుల వద్దకు చేరుకున్న కమాండోలు ఒక్కసారిగా ఉగ్రవాదులపై దాడి చేశారు. దాడికి జరుగుతుందని తెలిసిలోపై పొగ గ్రేనేడ్లను విసిరి ఉగ్రవాదులను మరింత గందరగోళంలో పడేశారు. ఏం జ‌రుగుతుందో తెలిసేలోపే 38 టెర్ర‌రిస్టుల‌ను, ఇద్ద‌రు పాక్ సైనికుల‌ను హ‌త‌మార్చారు.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఏలా చేస్తారంటే...

సర్జికల్ దాడులు చేయటం చాలా వ్యూహాత్మకమైన ఆపరేషన్. సర్వీస్ ఇంటెలిజెన్స్ విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), సాంకేతిక బృందాలు కలుపుకుని ఆర్మీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బలగాలతో ఈ ఆపరేషన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రత్యర్థి ఎంత దూరంలో ఉన్నాడు? చుట్టుపక్కల పరిస్థితేంటి? ఎంత వేగంగా పని చక్కబెట్టుకోవచ్చు వంటి అంశాలపై వివిధ స్థాయీల్లో తీవ్రమైన చర్చ, ఈ భాగాల మధ్య సమన్వయం అవసరం.
వీటన్నింటిపై స్పష్టత వచ్చాకే సర్జికల్ దాడులు మొదలవుతాయి. నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం లక్ష్యాలపై.. ఒక్క అడుగు కూడా లెక్కలో తేడా రాకుండా మెరుపువేగంతో దాడులు జరుగుతాయి. ఈ తతంగం జరుగుతు న్నంత సేపు ఆదేశం, నియంత్రణ, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య విభాగాల సమన్వయంతో ఈ ప్రత్యేక బృందాలు అనుసంధానమై ఉంటాయి. ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ సామాన్య జనానికి నష్టం జరగకుండా.. కేవలం లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేసేందుకు సర్జికల్ దాడులు నిర్వహిస్తారు. 

భార‌త్ వ‌ద్ద ప్ర‌త్యేక బృందాలు...

దాడులకు ముందే ప్రత్యర్థి వర్గంలోకి కోవర్టుల్లా ప్రవేశించి సేకరించే సమాచారం కూడా ఇలాంటి ఆపరేషన్లలో ప్రత్యేక భూమిక నిర్వహిస్తుంది. ఈ తరహా దాడులు చేయటంలో భారత్ వద్ద త్రివిధ దళాల్లో పలు ప్రత్యేక బృందాలున్నాయి. ఈ దాడుల్లో ప్రముఖ పాత్ర వైమానిక దళానిదే. భారత వైమానిక దళంలో కీలకమైన బృందాలున్నాయి. దీంతోపాటు భారత పారాచ్యూట్ రెజిమెంట్‌లోని శిక్షణ పొందిన పారాపైలట్లు ఇలాంటి ఆపరేషన్లు చేయటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో శ్రతువుపై పోరాడటం కష్టంగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి దాడులు నిర్వహిస్తారు. అటు నేవీ కూడా తమ మెరైన్ కమాండోస్ (మార్కోస్) ఈ తరహా దాడులు చేయటంలో దిట్ట అని పేర్కొంది. వైమానిక దళంలో ‘గరుడ’ దళం సామాన్యంగా ఇలాంటి దాడులకు శిక్షణ పొందుతుంది.

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ గ‌తంలో....

గ‌తంలో ఇలాంటి ఆప‌రేషన్ భార‌త ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. మ‌య‌న్మార్ లో భార‌త ఆప‌రేష‌న్ 2015 జూన్ లో 70 మంది భారత కమాండోలు మయన్మార్ అడవుల్లో సర్జికల్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 38 మంది నాగా మిలిటెంట్లు హతమవ్వగా ఏడుగురికి గాయాలయ్యాయి. జూన్4వ తేదీన మణిపూర్‌లో ఆర్మీ వాహనంపై దాడిచేసి 18 మంది జవాన్లను మట్టుబెట్టిన కాసేపటికే భారత్ ఈ దాడులు నిర్వహించింది. ఇక 2011 లో పాకిస్థాన్ లోని అబోత్తాబాద్ లో ఐఎస్ఐ భ‌ద్ర‌తా వ‌ల‌యంలోని ఓ ఇంటి పై అల్ ఖాయిధా చీప్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నాడ‌న్న ప‌క్కా సమాచారంతో అమెరికా బ‌ల‌గాలు మెరుపుదాడి చేశాయి. ఇక మరో స‌ర్జీక‌ల్ దాడుల చ‌రిత్ర గ‌మ‌నిస్తే... 1979 ఫ్రాన్స్ విమానాన్ని పాల‌స్తీనా విముక్తి ఉగ్ర‌వాదులు ఉగాండాలోని ఎంటెబీ లో హైజాక్ చేశారు.


100 మంది ఇజ్రాయిలీక‌మాండోలు నిర్వ‌హించిన ఈ ఆప‌రేష‌న్ లో ఉగ్ర‌వాద‌లంద‌రూ... ముగ్గురు ప్ర‌యాణికులు మృతి చెంద‌గా... మిగిలిన వారిని క్షేమంగా ర‌క్షించారు. ఇక 1961 లో క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో ను గ‌ద్దెదించేందుకు అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు జాన్ ఎఫ్ కెన‌డీ, సీఐఏ నేతృత్వంలో బే ఆఫ్ పిగ్స్  సమీపంలో ఈ ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్ లో 100 మంది అమెరిక‌న్ సైనికులు చ‌నిపోయారు. ఈ ఆప‌రేష‌న్ ద్వారా అనుకున్న‌ది సాధించ‌లేక‌పోవ‌డం అమెరికాను ఓ పీడ‌క‌ల‌గా మిగిలింది. ఇక‌పోతే...  1979లో కొందరు ఇరానియన్ విద్యార్థులు.. తెహ్రాన్‌లో 53 మంది అమెరికన్లను బందీలుగా చేసుకున్నారు. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సీక్రెట్ మిషన్‌కు ఆదేశించారు. ఆపరేషన్ ఈగల్ క్లాగా వ్యవహరించిన ఈ ఘటనకూడా అమెరికాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. బందీలను విడిపించే క్రమంలో అమెరికన్ సైనికులు ఇసుక తుపానులో చిక్కుకుపోయారు. ఓ హెలికాప్టర్ కూలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: