ఏపీ సీఎం మంత్రులపై గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మంత్రులు అందుకు సహకరించడంలేదని, ఎవరూ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని సీఎం ఫీలవుతున్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు.


తాను రోజూ నాలుగైదు గంటల కంటే ఎక్కువ నిద్రపోకుండా అనుక్షణం ఏపీ అభ్యున్నతి కోసం తపిస్తున్న తనకు మాదిరే మిగిలిన నేతలంతా పని చేయాలి కదా అన్న అసంతృప్తి ఉన్నాటర బాబు. దీంతో పనిచేయని మంత్రులపై వేటు వేయక తప్పదని భావిస్తున్నారట గురువారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలోనూ మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. 


దసరాకు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని చాలా కాలంగా ఓ టాక్‌ నడుస్తోంది. అదే నిజమైతే సరిగ్గా పనిచేయని మంత్రులపై వేటు పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరాకు కాకపోయినా ఏపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల అనంతరం ఈ ప్రక్షాళన కార్యక్రమం ఉందన్న టాక్  బలంగా వినిపిస్తోంది. అయితే పదవులు రాక అసంతృప్తి చెందుతున్న నేతల లిస్ట్ టీడీపీలో చాలానే ఉంది. ఒకవేళ ఎవరిపై వేటు పడ్డ ఆశావాహుల లిస్ట్‌ మరింత పెరిగే ఛాన్స్‌ లేకపోలేదు.


ఇప్పటికే  చాలా మంది నేతలు గత 10ఏళ్లుగా పదవులు లేక ముఖం మొత్తి ఉన్నారు. ఎప్పుడు ఛాన్స్‌ వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారందకి పదవులు ఇవ్వడం ఎలాగూ కుదరలేదు, కనీసం ఇలా పనిచేయని వారిని పక్కన పెట్టడ ద్వారా కొత్తవారికి అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు మరికొందరు.


ఏపీలో రెండు సారి కూడా  అధికారంలోకి రావాలనుకుంటున్న బాబు.. జనాలకు నాలుగు మంచి పనులు చేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తనలా  ఏ మంత్రి కష్టపడడం లేదన్న అసంతృప్తి బాబులో బాగా కనిపిస్తుంది. కొందరు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉంటే.. మరికొందరు నేతల పని తీరు ఏ మాత్రం బాగోలేకపోవటం.. ఇంకొంత మంది మంత్రుల నోటి ధురుసు పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందన్న భావనలో ఉన్న బాబు.. అలాంటి వారికి చెక్‌ పెట్టాలనుకుంటున్నారు.


ఇప్పటికే చంద్రబాబు దగ్గర ఓ లిస్ట్‌ రెఢీగా ఉందని త్వరలోనే అందులో టాప్‌ 5లో ఉన్న వారిపై వేటు తప్పదంటున్నారు. ఇప్పుడు ఆ ఐదుగురు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: