ముఖ్యమంత్రులపై ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాటల తూటాలు పేల్చడం మామూలే కానీ.. వాటికి ఓ హద్దు అంటూ ఉంటుంది. ఏం మాట్లాడినా సభ్యతతోనే మాట్లాడుతుంటారు. ఎందుకంటే రాజకీయ నేతలు మాట్లాడే మాటలు, చేసే చేతలను ప్రతి ఒక్కరు గమనిస్తుంటూ ఉంటారు. ప్రజాజీవితంలో ఉన్నవారు పది మందికి మార్గదర్శకులుగా ఉండాల్సిందే లేదంటే అభాసుపాలవుతారని తెలిసిందే.
.
అయితే కొన్ని రాష్ట్రాల్లో నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తరుచుగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ మీడియాలో నానుతుంటారు. ఇలాంటి వారిలో ఢిల్లీ ఆప్‌ నేతలు, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీ నేతలు ముందు వరుసలో ఉంటారు. అలాంటి వారిలో మన తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఉన్నరనుకోండి కాకపోతే మరీ అంత విచ్చలవిడిగా మాత్రం మాట్లాడరు అది వేరే విషయం. అయితే ఈ జాబితాలో తాజాగా మహారాష్ట్ర నేతలు కూడా చేరిపోతున్నారు.


విషయంలో ఏంటంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మహిళతో పోల్చింది ఆరాష్ట్ర ఎంపీ సుప్రియా సూలే.. వీధుల్లోని కుళాయిల దగ్గర మహిళల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గొడవపడతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన ఎన్సీపీ మహిళా కార్యకర్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ కామెంట్లు చేశారు. ఫడ్నవీస్ కు కోపం ముక్కుమీద ఉంటుందని మండిపడ్డారు. తాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా ఇలాంటి ముఖ్యమంత్రిని చూళ్లేదని ఆమె చెప్పారు. ఆయన ఎవరి మాటా వినరని ఆరోపించారు. 


ఒకవేళ ఆయనతో తప్పని సరి పరిస్థితుల్లో కలవాల్సి వస్తే..  తాను హెల్మెట్ ధరించి కలుస్తానని వ్యాఖ్యానించారు. ఆయనకున్న కోపం అలాంటిదని.. కోపంతో ఆయన ఏ వస్తువు విసురుతాడో తెలియదు కనుక హెల్మెట్ తోనే హాజరవుతానని ఆమె అన్నారు. అంతటితో ఆగని ఆమె.. తన కామెంట్లు ముఖ్యమంత్రికి తెలిసేలా ప్రసారం చేయాలని ఆమె మీడియాకు సూచించారు. సుప్రియా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: