ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని భారత్, పాక్ వైపు చూస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ని దొంగదెబ్బ తీయాలని ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదలను భారత్ పై ఉసిగొల్పుతుంది. ఈ సంవత్సరం జనవరి 1న పంజాబ్ లోని పాఠాన్ కోటపై దాడులు నిర్వహించింది. ఆ సమంలో మన సైనికులను ఏడుగురిని బలితీసుకున్నారు. గత వారం రోజుల క్రితం కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై దాడి చేసి అన్యాయంగా 18 మంది జవాన్ల ను బలి తీసుకున్నారు. దీంతో భారత్ సైన్యం పగతో రగిలిపోయింది..ఇక పాకిస్థాన్ చర్యలను ఏమాత్రం సహించబోం అంటున్నారు. పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ రెండు వైపులా వున్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం బుధవారం రాత్రి 'లక్షిత దాడులు (సర్జికల్‌ స్ట్రయిక్స్‌) నిర్వహించింది.  

ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు మరణించినట్లు భారత సైనికాధికారులు ప్రకటించారు.  అయితే పొరపాటున సరిహద్దులు దాటి పాక్ లో అడుగుపెట్టిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నాయి పాకిస్తాన్ భద్రతా బలగాలు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ప్రకటించిన కొద్దిసేపటికే ఈ విషయాన్ని ప్రకటించాయి పాక్ దళాలు. పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక ఈ  విషయంపై ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఎనిమిది మంది భారత సైనికులు ప్రవేశించారని.. పాక్ ఆర్మీ కాల్పుల్లో వారిలో ఏడుగురు చనిపోగా.. మిగిలిన ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది.
ఆ వీడియోలు, ఫొటోలను షేర్ చేయొద్దు: ఆర్మీ
కాగా ఇదంతా అవాస్థవమని నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాక్ షాక్ లో ఉందని దీంతో అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని సైనికులు ఎవరూ చనిపోలేదని ఆర్మీ అంటుంది. అయితే రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన  చందుబాబులాల్ చౌహాన్ అనే సైనికుడు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. తనను భారత రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: