ఏపీ ముఖ్యచంద్రబాబు నాయుడికి గతంలో అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే..తర్వాత ఆయన భద్రత మరింత పెంచారు. తాజాగా ఇప్పుడు ఆయనకు మరో ప్రమాదం తప్పింది.  ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా అక్కడ భారీ ఎత్తున పెలుడు శబ్ధం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా అని ఉరుకులు పరుగులు పెట్టారు. పేలుడు శబ్దంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Image result for chandrababu alipiri
వెంటనే ఆయనను కమాండోలు, అధికారులు బయటికి తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు తిరుపతిలోని అలిపిరి వద్ద నక్సల్స్ బాంబ్ బ్లాస్ట్ చేశారు..అరోజు ఆయన రక్తం వొడుతూ..ప్రాణాలతో బయట పడ్డారు. కాగాఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌ వద్ద  పెద్ద శబ్ధం వినడంతో మరోసారి ఖంగారు పడ్డారు.  అసలు విషయం ఏంటంటే..ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా, సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది.
Image result for chandrababu alipiri
అంత పెద్ద శబ్ధం వినడంతో అక్కడన్న వారు కంగారుపడ్డారు. సిలిండర్ గ్యాస్ లీకే ఈ ఘటనకు కారణం అని ప్రాథమిక అంచనాకు వచ్చారు.  ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపట్లో తెలియజేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: