పాకిస్థాన్‌ నుంచి ప్రపంచానికి ఎప్పటికైనా ముప్పు తప్పదనే ఆందోళన చాన్నాళ్లుగా చాలా దేశాల్లో ఉన్నదే. విచక్షణ లేని ఆ దేశం చేతిలో అణుబాంబులు ఉండడమే దానికి కారణం. ఇటు భారత్‌, అటు చైనా కూడా అణుశక్తి దేశాలే అయినా వాటి మీద మిగతా ప్రపంచానికి అంతగా భయాందోళనలు లేవు. కాందహార్ హైజాక్ లో భారత్ నుంచి విడుదలైన ఉగ్రవాది, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ వాగడం మొదలుపెట్టాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇండియన్ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. త్వరలోనే భారతదేశానికి తమ దళాలు (పాక్ ఆర్మీ) తగిన గుణపాఠం చెబుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.


Image result for india pakistan

భారత్‌ బాధ్యతాయుతమైన దేశమనే పేరు ఉంది. ‘తొలుత తాను ప్రయోగించరాదనే’ (నో ఫస్ట్‌ యూజ్‌) భారత్‌ కట్టుబడి ఉండగా, చైనా కూడా కొంత పద్ధతిగానే వ్యవహరిస్తుంది. ఇక మిగిలిందల్లా పాకిస్థాన్‌.. ఆ దేశ యుద్ధ చరిత్ర, నేపథ్యం, మాటలు చూస్తే ఇదే అత్యంత ప్రమాదకరమైనదనే భావన మిగతా ప్రపంచ దేశాల్లో ఉంది. కారణం అక్కడి ప్రభుత్వాల అంతగా పట్టు లేకపోవడం.. అనిశ్చిత రాజకీయాలు.. సైనికశక్తి బలంగా ఉండడం.. జీహాదీ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికం కావడం!


Image result for india pakistan

భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్‌ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టేదిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి. ఎట్టకేలకు శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్థాన్ కు తెలిపాయి.


Image result for india pakistan

నదులు యద్ధ క్షేత్రాలు కాదని, సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము వ్యతిరేకమని నర్మదా బచావ్ ఆందోళన్ వ్యవస్థాపక సభ్యురాలు మేధాపాట్కర్ అన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము పూర్తి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. జల యుద్ధాలకు తాము అంగీకరించబోమన్నారు. నదులు యుద్ధ క్షేత్రాలు కాదని, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. నిజానికి దేశ అవసరాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వాలు చెబుతుంటాయని, కానీ నిజానికి వాటి వల్ల బాగుపడేది మాత్రం వ్యాపార వర్గాలేనని ఆరోపించారు. చిన్నచిన్న డ్యాముల నిర్మాణం వల్లే పేదలకు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: