సరిహద్దుల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయ్. ఇప్ప‌టికే భారత సైన్యం ఇచ్చిన స్ట్రోక్‌తో పాక్‌కు దిమ్మతిరిగింది. అయితే, దానిని బ‌య‌ట‌ప‌డ‌నీయ‌కుండా ఆ దేశం బీరాలు ప‌లుకుతోంది. అస‌లు త‌మ‌ దేశంపై భార‌త్ దాడులు జ‌ర‌గ‌లేదంటూనే, మ‌రోప‌క్క ఈ దాడుల‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ ఇక స‌హ‌నం న‌శిస్తోంది. ముందుకు ఉరుకుతూ ఉగ్ర‌మూక‌ల్ని మ‌ట్టుబెట్టేందుకు సిద్ధ‌మైంది. ఇంత‌కీ యుద్ధం వ‌స్తే ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రికి ఎంత న‌ష్టం? పాక్ అంత‌ ధైర్యం చూపించ‌డానికి కార‌ణం ఏంటీ? ఇదే చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 


నిజానికి 2015లో అణు శాస్త్రవేత్తలు విడుదల చేసిన బులిటెన్ ల ప్రకారం భారత్-పాక్ దేశాల దగ్గర అణ్వాయుధ సంపత్తి ఇలా ఉంది.
భారత్ అణ్వాయుధ సంపత్తి: విమానం రకం వాటిలొ వార్ హెడ్లు వజ్ర- 32, శంషేర్-16, మొత్తం 48 ఉన్నాయి. భూమ్మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, వాటిలో వార్ హెడ్లు ఇలా ఉన్నాయి. పృధ్వీ 2- 24, అగ్ని1-20, అగ్ని2-8, అగ్ని 3-4, మొత్తం 56 ఉన్నాయి. సముద్రం మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు ధనుష్-2, కె 15-12, మొత్తం 14 ఉన్నాయి.

పాక్ దగ్గర అణ్వాయుధ సంపత్తి: విమాన రకం వాటిలో వార్ హెడ్లు ఎఫ్ 16 ఎ/బి-24, మిరాజ్ 3/4-12, మొత్తం 36 ఉన్నాయి. భూమ్మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, వాటిలో వార్ హెడ్లు ఇలా ఉన్నాయి. ఘజనీ (హతాఫ్-3)-16, షహీన్ 1 (హతాఫ్ 4)-16, షహీన్ 2(హతాఫ్ 6)-8, ఘోరీ (హతాఫ్ 5)-40, నాసర్ (హతాఫ్ 9)- 6, మొత్తం 86 ఉన్నాయి. క్రూయిజ్ క్షిపణలు బాబర్ (హతాఫ్ 7)-8 ఉన్నాయి.


భార‌త్, పాక్‌ల సైనిక ప‌టిమ ఎంత‌? ప్ర‌పంచ దేశాల సైనిక శ‌క్తిలో భార‌త్, పాక్‌ల స్థానం ఎంతో తెలుసుకుందాం
ప్రపంచ దేశాల్లో సైనిక శ‌క్తిలో భారత్ - 4వ స్థానం. పాక్ - 13వ స్థానం
* సాయుధ బలగాలు అన్నీకలిపి భారత్ - 48 లక్షలు, పాక్ - 14 లక్షలు 
* యుద్ధ విమానాలు - భారత్ - 1015.  పాక్ - 490 
* ఎయిర్ క్రాఫ్ట్‌లు -  భారత్ - 2,086. పాక్ - 923. 
* యుద్ధ‌ ట్యాంకులు - భారత్ - 6,000. పాక్ - 4,000
* యుద్ధ‌ నౌకలు-  భారత్- 184.   పాక్ - 74 
* ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ భారత్ - 2.    పాక్ -  0 
* జలాంతర్గాములు భారత్- 13.   పాక్ - 8. 
* అణు జలాంతర్గామలు భారత్- 2.   పాక్ -0 
* డిస్ట్రాయిర్స్ -  భారత్ - 9. పాక్ - 6 
* అణు బాంబులు (పక్కా సమాచారం ఎక్కడా లేదు) 
* భారత్  - 90. పాక్ - 113 )
 
మ‌ద్ద‌తు, బలం
* భారత్ - సైనికులు, ప్రజలు 
* పాక్ - చైనా, ఉగ్రవాదులు 
 
బలహీనత
* భారత్ - శాంతి , సహనం
* పాక్ - ఆలోచ‌న‌లేమి, కుతంత్రం 
 
యుద్ధంలో గెలుపు 
* భారత్ - 3.   
* పాక్ - 0 
 
జనాభా
* భారత్ - 130 కోట్లు, 
* పాక్ - 21 కోట్లు


భారత్ దగ్గర సుమారు 600 కిలోల ఫ్లుటోనియం నిల్వ ఉంది. పాక్ దగ్గర 170 కిలోలు ఉంది. అత్యంత శుద్ధి చేసిన యురేనియం (హెచ్ఇయు) సుమారు 3.1 టన్నుల మేర పాక్ దగ్గర ఉందని అంచనా. ఒక్కో వార్ హెడ్ కు 5 కిలోల ఫ్లుటోనియం, లేదా 15 కిలోల హెచ్ఇయు అవసరం అవుతుందని అంచనా. భారత్ 120, పాక్ 240 అణ్వాయుధాలను రూపొందించుకోగలవని అంచనా. 

ఎలా చూసినా, ఎలా లెక్క‌బెట్టినా పాకిస్తాన్ కంటే భార‌త్‌యే శ‌క్తివంత‌మైన దేశం. ఈ నేప‌థ్యంలో త‌మ కుతంత్రాల‌తో భార‌త్‌లోని, పాక్‌లోని పౌరుల‌ను అంత‌మొందించ‌డ‌మే పాకిస్తాన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంగా క‌నిపిస్తోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌దో ఈ తాజా యుద్ధమైనా పాకిస్తాన్ కు నేర్పాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: