ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా తెచ్చినందుకు తిరుప‌తిలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుకు ఈరోజు స‌న్మానం చేశారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనడానికి వ‌స్తోన్న ఆయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తూ వామ‌ప‌క్షాలు ర్యాలీ నిర్వ‌హించాయి. వెంక‌య్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. మ‌రోవైపు బీజేపీ శ్రేణులు తిరుప‌తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంకయ్యకు ఘన స్వాగతం పలికి అక్కడినుంచి స‌భా ప్రాంగ‌ణం వరకు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేదికపై వెంక‌య్య ప్ర‌సంగిస్తూ..


Image result for venkaiah naidu

దారి పొడవునా నిలబడి త‌న‌కు స్వాగతం పలికారని, ప్ర‌జ‌లు స్వాగతం ప‌లుకుతున్నది త‌న‌కు కాద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీకి అని చమత్కరించారు. ఏపీకి గ‌త ప్ర‌భుత్వం ఎంతో అన్యాయం చేసిందని అన్నారు. ఎన్డీఏ రాష్ట్రానికి రెవెన్యూ లోటును భ‌ర్తీ చేసేందుకు ప‌చ్చ‌జెండా ఊపింద‌ని చెప్పారు. రాష్ట్రానికి హోదాతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఆ స్థాయిలోనే ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. 


Image result for venkaiah naidu

నాలుగు దశాబ్దాలుగా ఏపీని పట్టించుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు త‌మ‌ను విమర్శించడం హాస్యాస్ప‌ద‌మేన‌ని వెంకయ్య అన్నారు. పోలవరం ఇంకా పూర్తికాలేదని త‌మ ప్ర‌భుత్వం వచ్చిన‌ రెండేళ్లకే త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌రి దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ఏపీకి ప్ర‌యోజ‌నాల్ని చేకూర్చే పోలవరం ఎందుకు పూర్తి చేయలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోల‌వ‌రానికి అయ్యే మొత్తం ఖ‌ర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. విభజన బిల్లులోని అన్ని అంశాలపై ఏపీ మంత్రుల‌తో తాము చర్చిస్తూనే ఉన్నట్లు చెప్పారు. 


Image result for venkaiah naidu

దేశానికి స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌కుడు వ‌చ్చారని, ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి ప‌థాన దూసుకుపోతోంద‌ని అన్నారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు దేశంలో మంచి నాయ‌క‌త్వం లేదని, ప్ర‌జ‌లు, భ‌గ‌వంతుడి ఆశీర్వాదంతో మోదీ లాంటి నాయ‌కుడు వ‌చ్చారని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభ‌జ‌న‌పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాట‌లు మాట్లాడింద‌ని వెంక‌య్య అన్నారు. 2004 ఎన్నిక‌లముందు టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని, తాము అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆనాడు చెప్పిందని, మ‌ళ్లీ 2014వ‌ర‌కు ఆ మాటే ఎత్త‌లేదని ఆయ‌న విమ‌ర్శించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: