బతుకమ్మ ప్రతి పాటలో స్త్రీ జీవితం వినపడుతుంది. సమాజాన్ని సున్నితీకరిస్తుంది. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వస్తే  కొంతవరకు సాధికారత సాధించినట్టే. పురుషుల ఆలోచనల్లో మార్పు వస్తేనే అది పూర్తిగా సాధ్యమవుతుంది. సమాజం లో మార్పు రావాలి. మార్పు రావాలంటే మహిళలు కూడా నిరంతరం తమ గళం వినిపిస్తూనే ఉండాలి. అందుకు బతు కమ్మ కూడా ఒక వేదికే. అమ్మాయిలకు బయటకు వెళ్లే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలుండాలంటే సాంస్కృ తికంగా సమాజం లో ఆమోదం ఉండాలి. రెండోది ప్రభుత్వం వైపు నుంచి రక్షణ ఉండాలి. అంటే సురక్షితమైన వాతావరణాన్ని కల్పిం చాలి. అందులోకి తాగే నీరు దగ్గర్నుంచి పబ్లిక్ టాయ్‌లెట్స్, చక్కటి రోడ్లు, సభ్యత గల ప్రయాణ సౌకర్యాలు అన్నీ వస్తా యి. మహిళల్ని మనం ఎలా చూస్తున్నాం అనే దానికి ఇవన్నీ గీటురాళ్లు. 

అయితే... ‘మన దేశంలోనే అన్నీ జరుగుతున్నాయి.. మన దేశంలోనే క్రైమ్ ఉంది.. ఇక ఎక్కడా లేదు’ అనేది! ఇది అపోహ. చాలా తప్పు. మీరు క్రైమ్ రికార్డ్ తీసుకుని యూఎస్‌లో ఏం జరుగుతోందో, ఇంకే కంట్రీలో ఏం జరుగుతోందో చూడండి. ప్రపంచంలోని ప్రతిచోటా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలు మనల్ని మహిళలకు రక్షణ లేని మూడో ప్రపంచ దేశాలుగా నిలబెడుతున్నాయి! దాన్ని మనం నమ్ముతున్నాం. ఇది సరికాదు. వాస్తవం గ్రహించి, మనల్ని పరిశీలించుకుని పరిస్థితి చక్కదిద్దుకోవాలన్నారు నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. రాజ‌కీయాల్లోకి అనుకోకుండానే వచ్చినా బాధ్య‌త ను మాత్రం బ‌లంగానే ఫీల‌వుతాన‌న్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ద‌స‌రా పండ‌గ‌ పుర‌స్క‌రించుకుని జాగృతి ఆధ్వ‌ర్యంలో బంగారు బ‌తుకమ్మ వేడుక‌ల‌ను ప్రారంభంమ‌య్యాయి.

ఈ సంద‌ర్బంగా క‌విత మీడియా తో త‌న అనుభ‌వాల‌ను, బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఎంచుకున్న కార‌ణాల‌ను వివ‌రించారు. బ‌తుకమ్మ మొద‌లు పెట్టినప్పుడు చాలా మంది అనుకున్నారు... ఆ వీళ్లు ఎన్ని రోజులు చేస్తారు? అని. ర‌కర‌కాలుగా విమర్శించార‌ని క‌విత తెలిపారు. బతుక‌మ్మను ఎత్తుకున్న‌ప్పుడు ఓ పెద్దాయ‌న ఫోన్ చేసి.. జీవితంలో ఎప్పుడైనా బతుక‌మ్మ‌ను ఎత్తుకున్నవా నువ్వు అని అవ‌హేళ‌న చేశారు. ఊర్లల్లో  దొర‌లుగా చెలామ‌ణి అవుతున్న  వాళ్లింటి వాళ్లు బతుకమ్మ‌ను ఎత్తుకోరని... ఆ ట్రెడిష‌న్ ని బ్రేక్ చేశాన‌ని తెలిపారు. ఇందుకు కార‌ణం... అందరితో క‌లిసి నడ‌వాల‌ని... అంత‌రితో క‌లిసి ఉద్య‌మంలో న‌డ‌వాల‌నే చేశాన‌న్నారు క‌విత‌. అయితే ఈ పండగ‌ను ఉద్య‌మ ప్ర‌తీక గా మ‌ల‌చాల‌నుకున్నానన్నారు. 


రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత దీన్ని తెలంగాణ సాంస్కృతిక ప్ర‌తీక‌గా దేశానికి  ప‌రిచయం చేయాల‌నుకున్నాను. వాస్త‌వానికి   బ‌తుక‌మ్మలో ఉన్న  బ్యూటీ ఎంటంటే... అస‌లు భిన్న‌త్వంలో ఉన్న అందం ఏంటి? ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఏంటి? అని చెప్పే పండుగ ఇదని తెలిపారు క‌విత‌. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కొట్లాటలు, కల్లోలాలు... జాతి విద్వేషాలు! అందరం కలసి ఉంటేనే అందం. అందరం కలిసి ఉంటేనే బాగుంటాం. ఈ రోజు ఈ సందేశాన్ని ప్రపంచా నికి చాటే సత్తా ఉన్న పండుగ బతుకమ్మ. ఆ విశ్వజనీనత ఉంది ఈ పండుగలో. అందుకే ఇప్పుడు తొమ్మిది దేశాల్లో ఈ పండుగను జరుపుతున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మన సంప్రదాయాన్ని ఇంకా గొప్పగా స్థిరపరుస్తుంది. ప్రపంచానికి, మనకు మధ్య దీన్నో సాంస్కృతిక వారధిగా మలుస్తున్నామ‌న్నారు ఎంపీ క‌విత‌.
 
మ‌రోవైపు... బ్రహ్మకుమారీలు కూడా ఈసారి పదమూడు దేశాల నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి మన దగ్గర బతుకమ్మ నిర్వహిస్తున్నారని తెలిపారు. బ‌తుక‌మ్మ మహిళా శక్తికి ప్రతిరూపం. రాజకీయాలలో మహిళల రిజర్వేషన్లు అనే విషయానికి వచ్చినప్పుడు మొదటి విషయం .. మహిళల సమస్యలను మహిళలే మాట్లాడాలి అన్నదానికి నేను ఒప్పుకోను. అందరూ మాట్లాడాలి. అప్పుడే ఆ అంశానికి బలం వస్తుంద‌ని క‌విత  వివ‌రించారు. ఇక‌పోతే... చట్టసభల్లో మహిళా ప్రతినిధులు ఎక్కువగా ఉంటే మహిళల సమస్యల మీద ఇంకా ఎక్కువగా మాట్లాడ్డంతోపాటు దేశ సమస్యల మీదా నిర్ణయాలలో మహిళలు పాల్పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని అంశాల్లో స్థిరత్వం ఉంటుం దన్నారు. 

ఇక త‌మ ఫ్యామిలీ విష‌యాల‌పై కూడా స్పందించారు. ఇంట్లో అమ్మానాన్నా, అన్నయ్య, నేను కలిస్తే పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటామ‌న్నారు. మా అమ్మ మంచి క్రిటిక్.  ‘అమ్మే మన కుటుంబానికి బలం’ అంటారు నాన్న. నిజంగా అమ్మ చాలా స్ట్రాంగ్.  మా బాధ్యతలు తీరకముందే నాన్న ఉన్న పదవులన్నీ వదులుకొని పార్టీ పెడ్తానంటే ‘మీరు మొండి వారు.. అనుకుంటే చేస్తారు.. చేయండి’ అని ఎంకరేజ్ చేసింది. ఇచ్చిన మాటకు జవాబుదారిగా ఉండాలనుకుం టుంది. మేమెప్పుడైనా టీవీల్లో ఏదైనా చెప్తూ కనపడితే.. ‘అప్పుడు  టీవీలో చెప్పినవ్ కదా.. చెయ్’ అని ప్రశ్నిస్తుంది. ‘చేయలేకపోతే చెప్పొద్దు కదా.. చెప్పినప్పుడు చేయాలి’ అంటుందన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.


మొత్తంమీద చాలా కాలంగా బ‌తుకమ్మ వేడుక‌లను జ‌రుపుకోవాలంటే కొంచెం అల‌స‌త్వం చూపించారు. మోడ్ర‌న్ కాలంలో ఈ బ‌తుక‌మ్మ ఏంటనీ చాలా మంది అస‌హించుకునేవారు. అయితే తెలంగాణ ఉద్య‌మ పుణ్య‌మో... క‌విత తీసుకున్న ఈ నిర్ణ‌య‌మో క‌రెక్టుగా చెప్పలేం కానీ... యావ‌త్ తెలంగాణ ప్రాంతంలో బతుక‌మ్మ మ‌రోసారి బ‌తికింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: