సెలబ్రిటీలను రాజకీయంగా తమ పార్టీ ప్రయోజనాలకోసం వాడుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. సెలబ్రిటీలు ఎన్నికల సమయంలో తమ మద్దతుదారులకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తే ఆ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయమైనట్లే. సరిగ్గా ఇలాంటి పంథానే అనుసరిస్తుంది టీడీపీ పార్టీ. ప్రస్తుతం రాజకీయకంగా, సినిమా పరంగా ఎదుగుతున్న సెలబ్రిటీ ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే పవన్ కళ్యాణ్. గతంలో పవన్ జనసేన నాయకుదిడా ఉంటూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా పరిక్షంగా పచ్చ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.