కల్వకుంట చంద్రశేఖర్ రావు..తెలంగాణ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే కేసీఆర్. యావత్ తెలంగాణలో బడికెళ్లే పిల్లల నుంచి పండు ముసలి వరకు కేసీఆర్ పేరు తెలియనివారంటే ఉండరు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడం.. మహామహులకే సాధ్యం కాని తరుణంలో.. ఆ బక్క మనిషి సుసాధ్యం చేసి చూపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. రాష్ట్ర సాధనకు ఆమరణ చేసి.. సఫలీకృతులయ్యారు. నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో దేవుడై వెలిగాడు. తెలంగాణ పితగా కీర్తింపబడుతున్నారు.