కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా.. ఇది బాలయ్య సినిమాలో ఓ డైలాగ్. శత్రువులకు తన ధైర్యం గురించి చెబుతూ బాలయ్య బేస్ వాయిస్ లో డైలాగ్ చెబితే థియేటర్లలో చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయి. అదే ధైర్యం ఇద్దరు ఆడపిల్లలు.. అడవికి రాజైన సింహం ముందు చూపించారు. వారి ధైర్యానికి సాక్షాత్తు మృగరాజే వెన్నుచూపి వెళ్లిపోయాడు.