అక్కడికి వెళ్లిన వాహనాలు కానీ, మనుషులుగానీ, రాకెట్లు కానీ మళ్లీ తిరిగి రావు. తిరిగి రావని తెలిసినా ప్రయోగాల నిమిత్తం కొన్ని వాహనాలను పంపితే అవి కూడా అదృశ్యం అయ్యాయి. కారణం ఎవరికి అంతుపట్టలేదు. ఏదో అదృశ్య శక్తి వాటిని మింగేస్తుందని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కథలు రూపంలో ఈ ప్రదేశం గురించి చెబుతూ ఉంటారు. ఈ కథనం పై హాలీవుడ్ లో ఒక సినిమాను సైతం విడుదల చేయడం విశేషం. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది ఆ ప్రదేశం పేరు అదే బెర్ముడా ట్రయాంగిల్