తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో... అంతే స్థాయిలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర అంతేస్థాయి లో ఉందని చెప్పొచ్చు. ఉద్యమ కాలంలో రాజకీయ పార్టీలను మమేకం చేయాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారు కోదండరాం. అయితే ఈ జేఏసీ నిర్మాణంలో కేసీఆర్ పాత్ర సైతం ఉందనే వాదనలు ఉన్నాయి.