రాజకీయ నాయకులు, ముఖ్యంగా ముందుతరం రాజకీయవేత్తలు వైరిపక్షాలను విమర్శిస్తూనే సందర్భం వచ్చినప్పుడు ఎదరి పక్షములోని వ్యక్తులను మెచ్చుకోవటం కొన్నిసార్లు కీర్తించటం కూడా జరుగుతుంది. ఈ అలవాటు అభిలషనీయం. అనేక క్లిష్ట సందర్భాలని ఇలాంటి సద్విమర్శలు, వ్యక్తిత్వములోని సుగుణాలను ప్రశంసించటం చాలా తేలిక పరుస్తాయి. అలాంటిదే ఈ సన్నివేశం.