ముఖేశ్ అంబానీ.. రిలయెన్స్ సామ్రాజ్యపు అధినేత. ప్రపంచంలోని అత్యున్నత ధనవంతుల్లో ఒకరు. ఒక్కగానొక్క కూతురు. పేరు ఈషా అంబానీ. 1991లో పుట్టింది. సైకాలజీలో యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె జియో, రిలయెన్స్ రీటైల్ విభాగాల్లో డైరెక్టర్ గా ఉన్నారు. అనంతరం మెకెన్సీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ గా కొంతకాలం పనిచేశారు. సాకర్ అంటే విపరీతమైన పిచ్చి.. పియానా వాయించడంలో దిట్ట. ఫ్యాషన్ అంటే కూడా ఇష్టమే. అందుకే సెలబ్రిటీ షోలలో మెరుస్తూ ఉంటుంది.