చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాటితోనే ప్రేక్షకుల విశేష ఆదరనలను పొంది పవర్ స్టార్ గా పేరొంది సామాజిక అవగాహన ఉన్న హీరోగా పేరొందిన వ్యక్తే పవన్ కల్యాణ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అధికార, విపక్షాలు, ప్రజలందరు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభకు 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' అని పేరు పెట్టారు.