నూతన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన గులాబీ పార్టీ... మరికొన్ని ఏళ్లు అధికారంలో ఉండాలన్న దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ నూతనంగా ఏర్పాటు కావడం, రాష్ట్ర విభజన సమస్యలు, అభివృద్ది దిశగా ముందుకు సాగాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యకలాపాలతో గులాబీ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ గా గడిపారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై ఆయనకు అంతగా సమయం దొరికేది కాదు.