ఎప్పుడో బ్యాంక్ ఖాతా ప్రారంభించినప్పుడు తీసుకున్న చెక్‌లను, ఇప్పుడు దుమ్ము దులిపి బయటకు తెస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఏటీఎంలకు తోడు, ఆన్లైన్/మొబైల్ బ్యాంకింగ్ వినియో గించడంతో, ఇప్పటివరకూ చెక్కులను వాడాల్సిన అవసరం చాలామందికి రాలేదు. పాత పెద్ద నోట్ల రద్దు, ఏటీఎంలు పనిచేయకపోవడం, బ్యాంకు శాఖకు వెళ్లి కొత్త నోట్లు తీసుకోవాల్సి రావడం వల్ల, బీరువాలో దాచిన చెక్కులతో పనిపడింది. అయితే ఇటీవలి కాలంలో చెక్ లలో బ్యాంకులు సాంకేతిక మార్పులు తెచ్చాయి. మరి పాత చెక్కులు సాంకెతికత లేమితో ఇకచెల్లవు.