ఆ కుర్చీలో కూర్చుంటే..ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చక్రం తిప్పేయెచ్చు..ముందు అధిష్టానం కాళ్లా వేళ్లా పడి డిసిసి ప్రెసిడెంట్ గా స్థానం దక్కుంచుకుంటే..ఇక తిరిగే ఉండదు..ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ సంపాదించడం ఏమంతం కష్టం కాదు. సునాయాసంగా ఎమ్మెల్యే అయ్యిపోవచ్చు..ఇనాళ్లు ఇలా లెక్కలు వేస్తూ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తాజాగా జిల్లా ప్రెసిడెంట్ కావాలంటే..అధిష్టానం పెట్టిన మెళికతో..కాంగ్రెస్ నేతలు ఆ పదవి మాకొద్దంటే మాకొద్దంటూ వెనక్కి తగ్గుతున్నారు