అటు సినిమా ఇండస్ట్రీని, ఇటు రాజకీయ రంగాన్ని రెండు చేతులతో సమానంగా ఏలిన నటీ, నాయకురాలు ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే జయలలిత. అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో జయలలిత అగ్ర నటిగా పేరు ప్రఖ్యాతలు గడించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అంతటి ప్రఖ్యాతి గాంచిన జయలలిత గత రెండు నెలల క్రితం అనారోగ్య కారణం దృష్ట్యా చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ విదితమే. అయితే ఆమెకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలని తలచిన వైద్య బృందం ఆ దిశగా వైద్య సేవలు అందించింది.