అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. త్యాగీతో పాటు..ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగి అలియాస్ జూలీ త్యాగిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.