అక్కినేని నాగార్జున, అమల తనయుడు అఖిల్ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఓ ప్రైవేటు అతిథిగృహంలో వైభవంగా నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సో