తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురియడంతో అన్నదాతల నెత్తిపై పిడుగుపడ్డట్లు అయింది. పొట్టకు వచ్చిన పంటలు పగిలిపోయాయి. వందలాది విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేట్లు కూలిపోవడంతో వృద్దురాలు మృతిచెందింది. నిన్న సాయంత్రం నుండి రాత్రవరకు నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షానికి సుమారు 20వేల ఎకరాల్లో పంట నష్టపోయంది. మూడు రోజుల క్రితం ఇదే పరిస్థితి ఎదురు కావడంతో ఐదుగురు పంటలకు తీవ్ర నష్టం జరుగగా ఐదుగురు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారు. కాగా మంగళవారం సాయంత్రం ఒకరు చనిపోవడంతో వడగళ్ల వర్షంతో చనిపోయిన వారి సంఖ్య ఆరు కు చేరుకుంది. కాగా వివిధ జిల్లాలో కూడా పిడుగులు పడి పశువులు చనిపోయాయి. కాగా మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షబీభత్సంతో అనేక ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటలు నెలకొరిగాయి. ఒక వైపు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటు మరో వైపు అడుగంటిన భూగర్బజలాలను పైకి తెప్పించడంలో అనేక అవస్థలను ఎదుర్కొంటు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగాన్ని వడగళ్లు తీవ్రనష్టాన్ని కలిగించాయి. పెంకుటిళ్లు కూలిపోయాయి. మామిడికాయలు రాలిపోయాయి. నష్టం కోట్లల్లో నే ఉంటుందని తెలుస్తుంది. వ్యవసాయంపై ఆదారపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: