సినీ పరిశ్రమకే కాదు దేశానికే గర్వకారణం మహానటుడు అమితాబ్... (‘బిగ్ బి’) సినిమాని ఎంతగా ప్రేమిస్తాడనడానికి ఇది చిన్న ఉదాహరణ. 2011 సంవత్సరానికి గాను ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించిన సంగతి విదితమే. గురువారం జరిగిన నంది అవార్డుల వేడుకలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమా థియేటర్ కివెళ్లినప్పుడు మన పక్కన కూర్చున్న వారి గురించి మనం ఆలోచించం.. వారి కులం, మతం, ఏమిచూడం... అందరూ సమాన భావాలతో సినిమాకు స్పందిస్తాం. అది చూసెటప్పుడు సంతోషం దు:ఖ, ఏడుపు లాంటి భావాలన్నీ అందరికీ ఒకేలా కలుగుతాయి. ఇది దేశ సమైఖ్యతకు సూచన. ిసినిమాలు దేశాన్ని సమైఖ్యంగా ఉంచేందుకు తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు.   ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానం గురించి మాట్లాడుతూ ఆయనకు అతితక్కువ వ్యవధిలో ఆహ్వానం అందిందని,  వాస్తవానికి ముందుగా ఖరారైన షెడ్యూలు ప్రకారం ఆయన గురువారం ఉత్తర ప్రదేశ్ లో ఓ కార్యక్రమానికి హాజరవ్వాలి. అయినా సరే తాను తప్పకుండా నంది అవార్డుల వేడుకకు వస్తానని చెప్పాడట. తాను సినిమాలోనే పుట్టాననీ, సినిమా లేకుండా తాను లేననీ, అందుకని వచ్చితీరుతాననీ మాట ఇచ్చాడు. అన్నట్టుగానే, ఉత్తర ప్రదేశ్ నుంచి సొంత ఖర్చుతో ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. అంతేకాదు, అవార్డు ద్వారా తనకు వచ్చిన 5 లక్షల నగదునూ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశాడు. సినిమా పట్ల, ప్రజల పురస్కారాల పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం అటువంటివి!

మరింత సమాచారం తెలుసుకోండి: