హైదరాబాద్: సోమవారం తెల్లవారు జామున నెల్లూరు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 50మంది వరకు ప్రయాణికులు మ్రుతి చెందారు.న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలులో అగ్రిప్రమాదం సంభవించడంతో రైల్లో మంటలు వ్యాపించి 50మంది వరకు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండటం వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారనీ భావిస్తున్నారు. మంటలకు ప్రయాణికులు మసైపోయారు. గుర్తుపట్టరాకుండా మారోపోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, అగ్నిప్రమాద సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని శవాలనే బయటకు తీసినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. మ్రుతుల్లో అధిక మంది మన రాష్ర్టానికి చెందిన ఉండి ఉండవచ్చని సమాచారం. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: