ఇసుక మేటలపై వేయిస్థంబాల దేవస్థానం నిర్మాణ చేపట్టిన ఓరుగల్లు కాకతీయులు వారి చరిత్రను నానాటికి కనుమరుగువుతుంది. అప్పటి చరిత్రకారులు కొన్ని ఏళ్లు నిర్మాణం చేపట్టిన, వారి చరిత్రను చిన్నాభిన్నం చేస్తున్నా మన చరిత్రను అధికారులు, నాయకులు, రాబోయే తరాలవారికి పాఠ్యపుస్తకాల్లోనే చూపించవలసి వచ్చే అవకాశముంది. కాకతీయుల కళాసంపధ కనుమరుగవుతుంది. అభివృద్ది పనులతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా తవ్వకాలు పునాది సైతం ఆర్కాలజీ అధికారుల అనుమతి ఉండాలి. కాని ఎలాంటి అనుమతి లేకుండా ఖిలా మధ్య కోటలోని శిల్పాలను తవ్వకాలు జరిపి అభివృద్ది పేరుతో అర్కాలజీ డిపార్ట్ మెంటు సిబ్బంది ఎవరూ లేకుండా కనీసం కాంట్రాక్టర్ ఎవరో తెలియకుండా పనులు జరుగుతున్నాయి.  తరతరాలుగా చెప్పుకుంటున్న కాకతీయుల కళాసంపధ రోజురోజుకు మరుగునపడిపోతుంది. గత పది సంవత్సరా కిందట హన్మకొండలోని వేయిస్థంబాల గుడిలోని కాకతీయులు ఎంతో అద్భుతంగా చెక్కించారు. అలాంటి కళను మన అధికారులు దానిని మరింత వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పి.... ఎక్కడికక్కడే అ విగ్రహాలను తీసివేసి.... దానిని నగరం శివారులోని పద్మాక్షిగుట్ట వద్ద పడేశారు. వాటిని మరల నిలుపుతామని... సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అధికారులు అక్కడే శిల్పాలను వృదాగా పడివేశారు.  పదునైన ఉలి ఆ శిలలను పగుళ్లు తీసింది.... కరుకైన ఆశిల్పి చేతులు పరుగులుతీశాయి. మనసులోని భావాలను అందమైన జ్ఞాపకాలను సుతిమెత్తని అనుభూతులు అతిసుందరంగా ఆవిష్కరించాడు అందమైన శిల్పాలను చెక్కుడు. ఒకటా, రెండా ఎన్నని చేప్పేది ఏమని వర్ణించేదిజ ఓరచూపలు నాగిని, మత్తెక్కించే మదనిక ఆమె కాళ్ల గజ్జెలు కడితితే చప్పడు చేస్తాయా అనిపించే తన్మయత్వం..... ఇలా ప్రతీ ప్రేమలోనూ జీవకళను ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండ వరంగల్, ఓరుగల్లు కోట, హన్మకొండలోని వేయిస్థంభాల దేవాలయం,  జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప, దేవాలయాల్లో ఈ అద్భుత సౌందర్య రాశులను చరిత్రపుటల్లో నిలిచిపోయాయి. కాని మన అధికారులు మాత్రం పట్టించుకోకవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: